
తాజా వార్తలు
ముంబయి: బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సింబా’. తెలుగులో ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమాకు ఇది రీమేక్‌గా వచ్చింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. సారా అలీ ఖాన్ కథానాయిక. ఈ చిత్రంలోని ‘మేరే వాలా డ్యాన్స్’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రణ్వీర్ తన డ్యాన్స్‌లతో ఆకట్టుకుంటే.. అతిథి పాత్రలో నటించిన సింగం అలియాస్ అజయ్ దేవగణ్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు.
అజయ్‌ను చూసి రణ్వీర్ సెల్యూట్ చేసిన సన్నివేశంతో పాట మొదలైంది. సారా అలీ ఖాన్ తన అందం, డ్యాన్సులతో ఆకట్టుకుంటున్నారు. లిజో జార్జ్, డీజే చెతాస్ కంపోజ్ చేసిన ఈ పాటను నేహా కక్కర్, నకాశ్ అజీజ్ ఆలపించారు. ఈ చిత్రంలో రణ్వీర్ భలేరావ్ అలియాస్ సింబా పాత్రలో నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, సోనూ సూద్ ప్రతినాయకుల పాత్రలు పోషించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
