close

తాజా వార్తలు

చాటుమాటు దాడులకు చెక్‌!
కోట్లల్లో వెబ్‌సైట్‌లు... రోజూ నెట్టింట్లో యాక్సెస్‌ చేస్తూనే ఉంటాం... మరైతే, ఏ వెబ్‌సైట్‌ ఎంతవరకూ సురక్షితం? ఎట్నుంచి ఎవరైనా సిస్టంలో ప్రవేశించొచ్చు. అడ్డుకోవాలంటే? వీటిని ప్రయత్నించండి.

చాటుమాటు దాడులకు చెక్‌!సైట్‌ చూడ్డానికి ఒక పేరుతో కనిపిస్తుంది. ఓపెన్‌ చేయగానే మరోటి వస్తుంది... ఇలాగే, ఏదైనా వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే క్షణాల్లో పలు ప్రకటనలు పొడుచుకొస్తుంటాయి.. ఎలాగంటే.. యాంటీవైరస్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోమనో.. బ్రౌజర్‌ అవుట్‌డేటెడ్‌ అయ్యిందనో మెసేజ్‌లు వస్తుంటాయి. ఒక్కోసారి మనం నిత్యం వాడే సెర్చింజన్‌ స్థానంలో మరోటి వచ్చి చేరుతుంది. సెర్చ్‌ ఫలితాల్ని అదే సేకరించి చూపిస్తుంది. ఒకవేళ మీరు మార్పు చేసినా చాటుమాటు దాడులకు చెక్‌!తిరిగి అదే చూపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? సింపుల్‌.. మీరు వాడే బ్రౌజర్‌ని రీసెట్‌ చేయాలి. అందుకు బ్రౌజర్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. వాడేది క్రోమ్‌ బ్రౌజర్‌ అయితే సెట్టింగ్స్‌లోని ‘అడ్వాన్స్డ్‌ సెట్టింగ్స్‌’ని చూడండి. దాంట్లో ‘రీసెట్‌ అండ్‌ క్ల్లీన్‌అప్‌’ కనిపిస్తుంది. సెలెక్ట్‌ చేసి బ్రౌజర్‌ని దారిలోకి తెచ్చుకోవచ్చు. కుకీస్‌ తీసేయడంతో పాటు బ్రౌజర్‌కి జత అయిన ఎక్స్‌టెన్షన్స్‌ కూడా డిసేబుల్‌ అవుతాయి. ఇలా ఎప్పటికప్పుడు బ్రౌజర్‌ని రీసెట్‌ చేయడం ద్వారా వెబ్‌ విహారాన్ని సురక్షితం చేసుకోవచ్చు.

‘యాడ్‌ఆన్‌’ రక్షణ
మీరు సిస్టంలో వాడేది కాస్పరస్కై యాంటీవైరస్‌ అయితే బ్రౌజర్‌కి రక్షణగా Kaspersky Protection యాడ్‌ఆన్‌ని జత చేయొచ్చు. క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌లను సపోర్టు చేస్తుంది. నిత్యం వెబ్‌ విహారాన్ని ఓ కంట కనిపెడుతూ హ్యాకర్ల దాడుల్ని అడ్డుకుంటుంది. క్రోమ్‌ యూజర్లు https://goo.gl/5gYrWA లింక్‌ నుంచి బ్రౌజర్‌కి జత చేయొచ్చు.
మరోటి ప్రయత్నిద్దాం అనుకుంటే.. Avira Browser Safety యాడ్‌ఆన్‌ ఉంది. ప్రమాదకరమైన సైట్‌లు, కనిపించని ట్రాకర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. బ్రౌజర్‌ ద్వారా వ్యక్తిగత వివరాల్ని తెలుసుకునేందుకు గాలం వేసే ఫిషింగ్‌, స్పామ్‌ ఎటాకర్ల ప్రయత్నాల్ని తిప్పికొడుతుంది. క్రోమ్‌ యూజర్లు వెబ్‌స్టోర్‌ నుంచి పొందొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/6WftvD
సాఫ్ట్‌వేర్‌లా ఒదిగిపోయి..
తక్కువ మెమరీతో చటుక్కున సిస్టంలో ఒదిగిపోయి.. రక్షణ కల్పించేందుకు
Norton Power Eraser టూల్‌ సిద్ధంగా ఉంది. అదీ ఉచితంగా. హ్యాకర్లు ప్రయోగించే బ్రౌజర్‌ హైజాకర్లను తిప్పికొడుతుంది. సిస్టం మొత్తాన్ని ఎప్పటికప్పుడు స్కాన్‌ చేస్తూ మాల్వేర్‌లను తొలగిస్తుంది. సిస్టంలో మరేదైనా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ వాడుతున్నప్పటికీ దీన్ని ప్రయత్నించొచ్చు. మీ సిస్టం ‘నార్మల్‌ మోడ్‌’లో రన్‌ కాకున్నప్పటికీ ‘సేఫ్‌ మోడ్‌’లో దీన్ని రన్‌ చేసి వైరస్‌లను క్లీన్‌ చేయొచ్చు. ఈ పవర్‌ ఎరేజర్‌ని ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. డౌన్‌లోడ్‌ చేసి రన్‌ చేయగానే పని మొదలుపెడుతుంది. డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/H4BBPa

చాటుమాటు దాడులకు చెక్‌!రివ్యూ చేయాలి..
అప్పటి వరకూ చూడని మెసేజ్‌లు.. డైలాగ్‌ బాక్స్‌లు.. కనిపిస్తున్నట్లయితే సిస్టంని రివ్యూ చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వారం రోజులుగా సిస్టంలో మీరు ఊహించని మార్పులు చూస్తున్నట్లయితే వెంటనే పరోగ్రామ్‌ ఫైల్స్‌లోకి వెళ్లి చూడండి. గత వారం రోజుల్లో ఏమైనా కొత్త సాఫ్ట్‌వేర్‌లు మీ ప్రమేయం లేకుండా ఇన్‌స్టాల్‌ అయ్యాయేమో చెక్‌ చేయండి. అలా కనిపించిన వాటిని మూలాల్లోకి వెళ్లి తొలగించండి. ఆ పనిని Revo Uninstaller టూల్‌కి అప్పగించండి. సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేయాల్సిన పని లేదు. యూఎస్‌బీ డ్రైవ్‌లోకి కాపీ చేసుకుని వాడుకునేలా పోర్టబుల్‌ వెర్షన్‌ కూడా ఉంది.

 

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.