close

తాజా వార్తలు

వాయుగండం గడిచేదెలా?

దేశంలో ఏటా లక్షలాది ప్రాణదీపాల్ని కర్కశంగా ఆర్పేస్తున్న తీవ్ర వాయుకాలుష్యంపై కదనకాహళి మోగిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, నగరాలకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకొచ్చింది. అయిదేళ్లలో 102 భారతీయ నగరాల్లో గాలిలోని అతిసూక్ష్మ ధూళికణాల బెడదను 20-30 శాతం మేర తగ్గించడానికి రూ.300కోట్ల వ్యయంతో జాతీయ వాయు శుద్ధి కార్యక్రమం (ఎన్‌కాప్‌) చేపడతామంటోంది. ప్రాణాంతక కశ్మలంపై పోరు నిమిత్తం కేంద్రానికి, రాష్ట్రాలకు ఇదమిత్థ కార్యసరళిని పర్యావరణశాఖ సూచిస్తోంది. గాలి కలుషితం కాకుండా నివారించడం, పరిస్థితి చేయిదాటకుండా నియంత్రించడం, దేశవ్యాప్తంగా వాయునాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్ని జనచేతనను బలోపేతం చేయడమే ‘ఎన్‌కాప్‌’ ప్రధాన లక్ష్యాలంటున్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఇతరుల క్రియాశీల భాగస్వామ్యంతో ఎన్నిరోజుల వ్యవధిలో ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో నిర్దేశించుకుని పురోగమిస్తామనడం వినసొంపుగా ఉంది! వాస్తవానికి మూడేళ్లలో వంద నగరాల్లో 35శాతం మేర కశ్మల నియంత్రణ ప్రతిపాదనలు నిరుడు వెలుగు చూశాయి. తరవాతి అయిదేళ్లలో 50శాతందాకా వాయుకాలుష్యాన్ని కట్టడి చేయదలచినట్లు కేంద్రం అప్పట్లో ప్రకటించింది. గత రెండేళ్లుగా దేశరాజధాని దిల్లీలో విస్తృతచర్యలు చేపట్టి ఎనిమిది శాతం మేర వాయుకాలుష్య తీవ్రతకు పగ్గాలు వేసిన నేపథ్యంలో, బహుశా అంచనాలు మారి ఉండాలి! అయిదేళ్ల తరవాత సమీక్షించి అవసరమైతే వాయుశుద్ధి కార్యక్రమాన్ని పొడిగిస్తామంటున్నారు. వార్షిక సమీక్షలతో ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టడంతోపాటు, ప్రణాళిక పరిధిని చురుగ్గా మరిన్ని నగరాలకు విస్తరించాల్సిన ఆవశ్యకతను కేంద్రం విస్మరించజాలదు.

వాయునాణ్యతకు తూట్లు పడటమన్నది కేవలం వందా నూటయాభై నగరాలకే పరిమితమైన ఉత్పాతం కాదు. దేశంలోని మూడొంతులకు పైగా నగరాలు, పట్టణాలు గ్యాస్‌ ఛాంబర్లుగా భ్రష్టుపట్టిన కఠోర యథార్థాన్ని ఎవ్వరూ కప్పిపుచ్చలేరు. భారత వైద్య పరిశోధన మండలి సహా వివిధ సంస్థల ఇటీవలి నిర్ధారణ ప్రకారం- 2017 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సంభవించిన ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వాయు కాలుష్యం కారణంగా చోటుచేసుకున్నదే. ఒక్క ఏడాదిలో ఎకాయెకి 12 లక్షల 40 వేలమంది పౌరుల పాలిట, పీల్చే గాలే విషధూమమైన దేశం మనది! నిరుడు ప్రపంచంలోని 15 అత్యంత కలుషిత నగరాల జాబితాను క్రోడీకరించగా, అందులో 14 ఇక్కడివే! అతి సూక్ష్మ ధూళి కణాల తీవ్రత ప్రాతిపదికన దిల్లీతో కాన్పూర్‌, ఫరీదాబాద్‌, గయ, వారణాసి వంటివి పోటీపడుతుండగా- వరంగల్‌, కర్నూలు లాంటిచోట్ల గాలిలో నికెల్‌, సీసం, ఆర్సెనిక్‌ శాతాలు ఇంతలంతలవుతున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌లో అయిదేళ్ల కాలావధిలో 40 శాతం దాకా మెరుగుదల సాధించగలిగారు. శాంటియాగో (చిలీ) 22 సంవత్సరాల్లో 61 శాతం, మెక్సికో నగరం సుమారు      పాతికేళ్లలో 73 శాతం మేర వాయుకశ్మలాన్ని నియంత్రించగలిగాయి. అత్యంత వాయుకాలుష్య భరిత నగరాల జాబితాలో ‘బలాధిక్యం’, కశ్మలం కాటుకు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న అభాగ్యుల సంఖ్యాపరంగా చైనాను తలదన్నిన ‘రికార్డు’ కలిగిన భారత్‌- హుటాహుటిన విస్తృత కార్యాచరణకు ఉద్యుక్తం కావాల్సిందే. అందుకుతగ్గట్లు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, స్థానిక సంస్థలు అర్థవంతమైన సమన్వయంతో సత్ఫలితాల సాధనకు నిబద్ధం కావాలి. కాలుష్య నియంత్రణ మండళ్లను సాకల్యంగా ప్రక్షాళించి వివిధ అంచెల్లో యంత్రాంగాన్ని ఉరకలెత్తించాలి. ఇది ఉమ్మడిగా పోరాడి, తప్పనిసరిగా నెగ్గి తీరాల్సిన యుద్ధం!

లక్ష్యం బృహత్తరమైనదైనప్పుడు కృషీ దీటుగానే ఉండాలి. అగ్రరాజ్యం అమెరికా పుష్కరకాలంలో సాధించగలిగిన ఫలితాలను చైనా నాలుగేళ్లలోనే నమోదు చేసిందని ఆ మధ్య షికాగో విశ్వవిద్యాలయ అధ్యయనం ధ్రువీకరించింది. వాయు కాలుష్య నియంత్రణ నిమిత్తం ఒక్క బీజింగ్‌ నగరంలోనే ఏడున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించిన చైనా- కశ్మల కారక పరిశ్రమలు, సంస్థల విషయంలో నిష్కర్షగా వ్యవహరించింది. పదేళ్లుగా చైనాలో వాయుకాలుష్య మరణాలు మూడు శాతం తగ్గాయి. అదే, ఇండియాలో దాదాపు 23 శాతం మేర పెరిగాయి! అటువంటిచోట, అయిదేళ్లపాటు 102 నగరాల్లో వెచ్చించడానికి రూ.300 కోట్లు ఏ మూలకు? సమధికంగా నిధుల కేటాయింపునే కాదు- ఈ ఆరోగ్య ఆత్యయిక స్థితిలో శీఘ్ర, సమర్థ, బహుముఖ కార్యాచరణ అత్యావశ్యకతనూ ప్రభుత్వాలు ఉపేక్షించే వీల్లేదు. పర్యావరణ పరిరక్షణను, పరిసరాల పరిశుభ్రతను సంస్కృతిగా అలవరచి పౌర భాగస్వామ్యానికి పెద్దపీట వేసిన ఆస్ట్రేలియా, బార్బడోస్‌, కెనడా తదితర దేశాలు వాయు నాణ్యతకు నెలవులై మన్ననలందుకొంటున్నాయి. ఈ ఒరవడికి యోజనాల దూరం వెనకబడిన భారత్‌- వాయు నాణ్యత, కర్బన ఉద్గారాల పరిమాణాలను మదింపు వేసి వెలువరించే 180 దేశాల పర్యావరణ పనితీరు సూచీలో 177వ స్థానాన అలమటిస్తోంది. ఇందుకు సరైన విరుగుడు లేదా అంటే, కచ్చితంగా ఉంది. అవినీతి మడుగులో మునకలేస్తూ విధిద్రోహాలకు తెగబడుతున్న కాలుష్య నియంత్రణ మండళ్ల భరతం పట్టేలా సర్కారీ కార్యాచరణతో పాటు పౌర నిఘానేత్రం విచ్చుకోవాలి. పౌరసమాజంలో పర్యావరణ స్పృహ ఇనుమడింపజేసే కార్యక్రమాల నిర్వహణ మొదలు విస్తృత ప్రజారవాణా వ్యవస్థను జనావళికి చేరువ చేసేందుకు ప్రభుత్వాలూ కంకణబద్ధం కావాలి. ప్రాణాలు తోడేసే వాయుగండం ముప్పు ముమ్మరిస్తున్నప్పుడు, ఏకోన్ముఖ పరిణత వ్యూహాలు పదునుతేలితేనే- జాతికి సాంత్వన దక్కుతుంది!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.

asdfCI_URI Object ( [keyval] => Array ( ) [uri_string] => newsdetails/9/2019/01/12/43265 [segments] => Array ( [1] => newsdetails [2] => 9 [3] => 2019 [4] => 01 [5] => 12 [6] => 43265 ) [rsegments] => Array ( [1] => Index [2] => newsdetails [3] => 9 [4] => 2019 [5] => 01 [6] => 12 [7] => 43265 ) [_permitted_uri_chars:protected] => a-z 0-9~%.:_\- !@| [config] => CI_Config Object ( [config] => Array ( [base_url] => https://www.eenadu.net [index_page] => [uri_protocol] => REQUEST_URI [url_suffix] => [language] => english [charset] => UTF-8 [enable_hooks] => 1 [subclass_prefix] => MY_ [composer_autoload] => [permitted_uri_chars] => a-z 0-9~%.:_\- !@| [enable_query_strings] => [controller_trigger] => c [function_trigger] => m [directory_trigger] => d [allow_get_array] => 1 [log_threshold] => 0 [log_path] => [log_file_extension] => [log_file_permissions] => 420 [log_date_format] => Y-m-d H:i:s [error_views_path] => [cache_path] => [cache_query_string] => [encryption_key] => [sess_driver] => files [sess_cookie_name] => ci_session [sess_expiration] => 7200 [sess_save_path] => /var/www/html/session [sess_match_ip] => [sess_time_to_update] => 600 [sess_regenerate_destroy] => [cookie_prefix] => [cookie_domain] => [cookie_path] => / [cookie_secure] => [cookie_httponly] => [standardize_newlines] => [global_xss_filtering] => [csrf_protection] => [csrf_token_name] => csrf_test_name [csrf_cookie_name] => csrf_cookie_name [csrf_expire] => 7200 [csrf_regenerate] => 1 [csrf_exclude_uris] => Array ( ) [compress_output] => [time_reference] => local [rewrite_short_tags] => [proxy_ips] => ) [is_loaded] => Array ( ) [_config_paths] => Array ( [0] => /var/www/html/eenaduportal/eenadu/application/ ) ) )