close

తాజా వార్తలు

వీళ్ల పని నవ్వించడమే!

వేదికపై ఆ నలుగురూ తమకెదురుగా ఉన్న ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.  ఫలానా సందర్భం అని చెప్పినా దానికి తగినట్లుగా జోకులు అల్లుతున్నారు. ఇదంతా హైదరాబాద్‌కు చెందిన ‘ఇంప్రూవ్‌ కామెడీ హైదరాబాద్‌ (ఐసీహెచ్‌)’ మిత్ర బృందం నిర్వహించే కార్యక్రమం. దీన్ని జయశ్రీరాజ్‌, ప్రణవి పుల్లగుమ్మి, జై సోలంకి, అథిర కలిసి ప్రారంభించారు. దీని నిర్వాహకుల్లో ఒకరైన జయశ్రీరాజ్‌..  తమ గురించి చెబుతున్నారిలా.

వీళ్ల పని నవ్వించడమే!

మా బృంద సభ్యులంతా ఉన్నత విద్యావంతులే. అయిదంకెల జీతం అందుకుంటున్నవారే. మా అందరి అభిరుచి హాస్యం. అదే మమ్మల్ని కలిపింది. మాకు ఉద్యోగం జీవనాధారమైతే, ఈ అభిరుచి ఇతరులను నవ్విస్తూ ఆరోగ్యంగా ఉంచడానికే. హాస్యంతోపాటు సామాజిక సేవ, మూగ జీవాల సంరక్షణ, నృత్యం, నాటకాలు, టీవీ షోలు చేయడం కూడా మా అభిరుచుల్లో ఓ భాగం. ఈ రోజుల్లో అందరివీ బిజీ జీవితాలే. కాస్తయినా హాస్యం లేకపోతే ఒత్తిడి తప్పదు. అందుకే దీన్ని ప్రారంభించాం. మేం మొదట్లో స్టాండప్‌ కామెడీ చేసేవాళ్లం. ఇప్పుడు ఇంప్రూవ్‌ కామెడీగా మార్చాం. ఎదుటి వాడిని ఏడిపించడం కన్నా నవ్వించడమే కష్టం. ఒక్కసారి హాస్యాన్ని పంచగలిగితే వాళ్లు సంతోషించడమే కాదు... జీవితాంతం మనల్ని గుర్తు పెట్టుకుంటారు. మేం అదే చేస్తున్నాం. నాది హైదరాబాదే. ఏంబీఏ చదివా. ఆల్‌ ఇండియా రేడియోలో వీళ్ల పని నవ్వించడమే!ఆర్జేగా పనిచేస్తున్నా. థియేటర్‌ ఆర్టిస్ట్‌ని కూడా. ఇంట్లో అమ్మా, నాన్న, అన్నయ్య, నేను. నాన్న వ్యాపారి. అమ్మ ఇంట్లోనే ఉంటుంది. అల్లరి చేస్తూ, గారాబంగా పెరిగిన నాకు ఎప్పుడు నవ్వుతూ ఉండటం, చుట్టూ ఉన్నవారిని నవ్వించడం ఇష్టం. నాలుగేళ్లగా రెయిన్‌బో ఎఫ్‌ఎంలో ‘నమస్తే...హలో...ఆదాబ్‌’ పేరుతో వారానికో రోజు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు ఆర్జేగా చేస్తున్నా. మీలో ఎవరు కోటీశ్వరుడు’లో పాల్గొని, మూడున్నర లక్షల రూపాయల వరకు గెలుచుకున్నా. అలాగే టీవీ సీరీస్‌, యూట్యూబ్‌ వీడియోలు చేశా. మూగజీవుల సంరక్షణలో సేవలందిస్తున్నా. చదువురీత్యా కొన్నాళ్లు న్యూయార్క్‌ వెళ్లా. అక్కడ ఉండే మనవాళ్లలో ఏదో కోల్పోయిన భావనని గుర్తించా. దాంతో అమెరికా రేడియోకి ఆర్‌జేగా చేస్తున్నా. ఇక్కడి ప్రత్యేకతల్ని వాళ్లకు చెబుతా. ఇలా మా బృంద సభ్యులమంతా రకరకాల పనుల్లో బిజీగా ఉన్నా ఆదివారం నాడు అంతా కలుసుకుంటాం. అయిదు గంటల పాటు రకరకాల సందర్భాలను మేళవిస్తూ ఎలా నవ్వించాలా అని ఆలోచించి సాధన చేసి షోకి సిద్ధం అవుతాం.

ఇంటి వాతావరణం ప్రతిబింబించేలా... 
మా కార్యక్రమంలో ఎక్కువగా అత్తా కోడళ్లు, భార్యాభర్తలకు సంబంధించిన జోకులే ఉంటాయి. మేం మాత్రమే జోక్స్‌ చెప్పి నవ్వించడం కాదు, ప్రేక్షకులు అడిగిన వాటికీ అప్పటికప్పుడు స్పందిస్తాం. ఎక్కువగా అత్తాకోడళ్ల మధ్య జరిగే సమస్యలపై కామెడీ చేయమని అడుగుతారు. అలాగే టీవీ ఛానళ్ల విషయంలో భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి సరదా గొడవలను ప్రస్తావిస్తుంటారు. ఎవరేం చెప్పినా వెంటనే చేస్తాం. అలాగని ఎవరినీ కించపరిచేలా మాట్లాడకూడదనేది మా నియమం. హైదరాబాద్‌తోపాటు, బెంగళూరులోనూ పలు ప్రదర్శనలు ఇచ్చాం. గంటన్నర సేపు చేసే ఈ షో కి వచ్చేవారు  హాయిగా నవ్వుకుని వెళ్లడం చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంతకన్నా కావల్సిందేముంటుంది. నామమాత్రపు రుసుముతో దీన్ని నిర్వహిస్తున్నాం’  అని చెబుతుంది జయశ్రీ.

ఈ బృందంలో మరో సభ్యరాలు ప్రణవి. ఆమెదీ హైదరాబాదే. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. హాస్యంపై ఇష్టంతో స్టాండప్‌ కమెడియన్‌గా మారింది. ఆ తరువాతే ఈ ఐసీహెచ్‌ బృందంలో చేరింది. అలాగే కేరళకు చెందిన అథిర కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినే. హైదరాబాద్‌లోనే పనిచేస్తోంది. అమెరికన్‌ టీవీషోలు కూడా చేస్తోంది. హైదరాబాద్‌కు చెందిన జై సోలంకి కూడా జీఎస్టీ ప్రాక్టీషనర్‌.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.