close

తాజా వార్తలు

రజనీకాంత్‌ సరసన కీర్తి సురేశ్‌

జోరుగా ప్రచారం

రజనీకాంత్‌ సరసన కీర్తి సురేశ్‌

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘పేట’ సినిమాతో ఇటీవల మంచి హిట్‌ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు గురించి కొన్ని రోజుల క్రితం మురుగదాస్‌ మాట్లాడుతూ.. రజనీకి కథ చెప్పానని, ఆయన నుంచి ఫోన్‌కాల్‌ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఫాంటసీ చిత్రంగా దీన్ని తెరకెక్కించబోతున్నట్లు కూడా చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు.

ఇందులో రజనీకాంత్‌ సరసన కీర్తి సురేశ్‌ నటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. సినిమాలోని కథానాయిక పాత్రకు ఆమె బాగా సరిపోతారని యూనిట్‌ భావిస్తోందట. ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే చిత్ర బృందం నుంచి ప్రకటన రావాల్సిందే. కీర్తి సురేశ్‌ ‘సర్కార్‌’ సినిమా కోసం మురుగదాస్‌తో కలిసి పనిచేశారు. విజయ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం విజయం సాధించింది.

కీర్తి సురేశ్‌ ప్రస్తుతం ఓ మలయాళ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవల తెలుగులో ఆమె కొత్త చిత్రం షూటింగ్‌ ఆరంభమైంది. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. మరోపక్క ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలోనూ కీర్తి నటించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల తెగ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై నటి, చిత్ర బృందం స్పందించలేదు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.