
తాజా వార్తలు
దిల్లీ: దేశ రాజధానిలో కాలుష్య తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. ఇక దీని వల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువే. దీంతో నగరవాసులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్యులకే కాదు ప్రముఖులకు కూడా ఈ సమస్యలు తప్పట్లేదు. వీటితో విసుగెత్తిపోయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు.. తాను రిటైర్ అయిన తర్వాత దిల్లీలో ఉండను గాక ఉండనని చెబుతున్నారు.
దిల్లీ కాలుష్యంపై కేసు విచారణ జరుపుతున్న సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో దిల్లీలో ఉండేందుకు చాలా ఇష్టపడేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితులు ఉండగలిగేలా లేవు. ఇక్కడ కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారుతోంది. నా రిటైర్మెంట్ తర్వాత నేను దిల్లీలో ఉండను’ అని జస్టిస్ మిశ్రా చెప్పుకొచ్చారు. అంతేగాక.. ట్రాఫిక్ వల్లే తాను ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జీల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని తెలిపారు.
ఇక కేసు విచారణలో భాగంగా.. దిల్లీ-మీరట్ మధ్య రాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌ను 10 రోజుల్లోగా తీసుకురావాలని దిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి ప్రభుత్వం స్పందిస్తూ ఈ ప్రాజెక్టు కోసం తమ వద్ద సరిపడా నిధులు లేవని తెలిపింది. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు మీ బాధ్యతల నుంచి తప్పించుకోకూడదు. ఈ ప్రాజెక్టు దిల్లీ ప్రజల కోసమే చేపట్టినది’ అని హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- కిర్రాక్ కోహ్లి
- తీర్పు చెప్పిన తూటా
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
