
తాజా వార్తలు
ఫన్నీగా ‘టోటల్ ధమాల్’ ట్రైలర్
ముంబయి: బాలీవుడ్ అగ్ర నటులు అజయ్ దేవగణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, జానీ లివర్, రితేశ్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టోటల్ ధమాల్’. ఇంద్ర కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2011లో వచ్చిన ‘డబుల్ ధమాల్’కు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. జనక్‌పూర్ ప్రాంతంలో రూ.50 కోట్లకు సంబంధించిన ఓ రహస్యం ఉందని ఓ వ్యక్తి అంటున్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.
ఇక ఆ రూ.50 కోట్ల కోసం ఎవరికి వారు ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో జనక్‌పూర్‌కు చేరుకునే క్రమంలో పలు మృగాలు ఈ గ్యాంగ్‌ను వెంబడిస్తుంటాయి. మొత్తానికి ఆ రూ.50 కోట్లు ఎవరికి దక్కాయన్నదే కథ. ‘నేనెంత ఎదవనో వారికి తెలీదు’ అని అనిల్ కపూర్ అంటే.. ఇందుకు మాధురి.. ‘నాకు తెలుసు’ అనడం ఫన్నీగా ఉంది. వైల్డెస్ట్ అడ్వెంచర్ కామెడీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, అజయ్ దేవగణ్ ఫిలింస్, మారుతి మల్టీనేషనల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హిమేశ్ రేషమ్మియా సంగీతం అందించారు. ఫిబ్రవరి 22న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
