close

తాజా వార్తలు

మీ ప్రేమ వల్లే ఇలా!

ఇన్‌స్టాలో సన్నీ లియోనికి 18 మిలియన్ల మంది ఫాలోవర్లు

మీ ప్రేమ వల్లే ఇలా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అభిమానుల ప్రేమ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను’ అంటున్నారు బాలీవుడ్‌ నటి సన్నీ లియోని. ఇన్‌స్టాగ్రామ్‌ ఆమె ఫాలోవర్ల సంఖ్య 18 మిలియన్ల మార్క్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు చెబుతూ సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది.

‘18మిలియన్‌ మార్క్‌కు చేర్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇది డేనియల్‌తో డ్యాన్స్‌, వేడుక చేసుకోవాల్సిన సమయం. లవ్యూ ఆల్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చి డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేసింది.

ఈ వీడియోలో సన్నీ, తన భర్త డేనియల్‌ ‘సింబా’లో పాటకు డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. రణ్‌వీర్‌ సింగ్‌, సారా అలీఖాన్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘సింబా’లోని ‘ఆంఖ్‌ మారే’ పాటకు సన్నీ, డేనియల్‌ దంపతులు స్టెప్పులేశారు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికి ఈ వీడియోను దాదాపు 15 లక్షల మంది వీక్షించారు. సుమారు నాలుగు లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.