close

తాజా వార్తలు

మైనర్లకు ప్రత్యేకంగా...

పిల్లల ఉన్నత చదువుల కోసం మదుపు చేయాలనుకునే తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకొని ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఓ కొత్త పథకాన్ని తెచ్చింది. దాని పేరు ఏబీఎస్‌ఎల్‌ బాల్‌ భవిష్య యోజన. మైనర్‌ పిల్లల పేరుమీద వారి తల్లిదండ్రులు, తాతయ్యలు, బామ్మలతో పాటు ఇతర బంధువులు, ట్రస్టులు కూడా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. ఈ పథకంలో ఒకేసారి మదుపు చేయాలనుకుంటే కనీస పెట్టుబడి రూ.5,000. సిప్‌ చేయాలనుకుంటే కనీస పెట్టుబడి రూ.1,000. కనీసం ఐదేళ్లు లేదా మైనర్‌కు 18 ఏళ్లు వచ్చేదాకా.. ఈ రెండింటిలో ఏది ముందయితే అప్పటివరకూ పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓ ఫిబ్రవరి 5 వరకూ అందుబాటులో ఉంది. ఓపెన్‌ ఎండెడ్‌ పథకం కాబట్టి, ఆ తర్వాత కూడా మదుపు చేసుకోవచ్చు. ఇందులో రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి. వెల్త్‌ ప్లాన్‌లో 65%-100% ఈక్విటీల్లో, ఈక్విటీ ఆధారిత పథకాల్లో మదుపు చేస్తారు. డెట్‌, మనీ మార్కెట్‌ పథకాల్లో 0-35%, రీట్్స, ఇన్విట్స్‌లో 0-10శాతం వరకూ కేటాయిస్తారు. తక్కువ నష్టభయం ఉండాలనుకునేవారు సేవింగ్స్‌ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో డెట్‌, మనీ మార్కెట్‌లో 75-90 శాతం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాల్లో 10-25శాతం, రీట్స్‌, ఇన్విట్స్‌లో 0-10% పెట్టుబడి పెడతారు. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి లేదా.. రెండూ కూడా ఎంచుకోవచ్చు. వెల్త్‌ ప్లాన్‌ నుంచి కొంతకాలం తర్వాత సేవింగ్‌ ప్లాన్‌కు మారే వీలుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.