
తాజా వార్తలు
రాహుల్ గాంధీపై అరుణ్ జైట్లీ విమర్శలు
న్యూదిల్లీ: తరగతి గదిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థిని పాస్ కాలేకపోయిన విద్యార్థి ద్వేషిస్తూనే ఉంటాడని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరు ఇలాగే ఉందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శలు చేశారు. రక్షణ, న్యాయ, రిజర్వ్ బ్యాంకు వంటి వ్యవస్థలపై కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం మొదలు పెట్టిందని, వ్యవస్థను నాశనం చేసేవారి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. దేశంలోని వ్యవస్థలను భాజపా నాశనం చేస్తోందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆర్బీఐ, న్యాయవ్యవస్థ, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వంటి వాటిల్లో జోక్యం చేసుకునేదని తన ఫేస్బుక్ ఖాతాలో రాసుకొచ్చారు. మనవ్యవస్థ దాడులకు గురవుతోందని అన్నారు. ‘పశ్చిమ బెంగాల్లో భాజపా నేతల హెలికాప్టర్లు దిగే అవకాశం లేదు. ప్రజలతో ఏర్పాటు చేసే సమావేశాలను అడ్డుకుంటున్నారు. రథయాత్రలకు అనుమతి ఇవ్వట్లేదు. వ్యవస్థల రక్షకులం అని చెప్పుకుంటున్న వారిలో రెండు రకాల ధోరణులు చూడవచ్చు. ఒకవైపు ప్రభుత్వంపై వారు వీలైనన్ని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు భావప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని అంటున్నారు’ అని పేర్కొన్నారు.
‘ప్రజాస్వామ్యం అంటూ వారు మొసలి కన్నీరు కార్చుతున్నారు. అదే సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో నియంతృత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మావోయిస్టులకు మద్దతు తెలిపింది. దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఓ గ్యాంగ్‌కి మద్దతుగా నిలిచింది. అర్బన్ నక్సల్స్‌ని రక్షిస్తోంది. ఇన్ని పనులు చేస్తూ భారతీయ విధానం, వ్యవస్థల రక్షణ అంటూ మాట్లాడుతోంది. వ్యవస్థల రక్షకులు అని చెప్పుకుంటున్న వీరంతా.. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారికి కూడా మద్దతు పలుకుతున్నారు. రఫేల్ ఒప్పందంపై పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన రెండు ప్రసంగాలు.. మోదీపై వ్యక్తిగత ద్వేషం, అసూయల నుంచి పుట్టుకొచ్చినవిగా ఉన్నాయి. ఉత్తీర్ణుడు కాలేకపోయిన విద్యార్థి.. తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని ద్వేషిస్తుంటాడు. రఫేల్ ఒప్పందం మన దేశ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతేగాక, మేము చేసుకున్న ఒప్పందం వల్ల ప్రభుత్వ ఖజానాకు చాలా కోట్లు మిగిలాయి. అన్ని వ్యవస్థల కన్నా గొప్పదైన పార్లమెంటుని ఒకే ఒక వ్యక్తి రాహుల్ నాశనం చేశారన్న విషయం చరిత్రలో నిలిచిపోతుంది’ అని జైట్లీ విమర్శలు చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
- వివాహం వద్దంటూ పీటలపై నుంచి వెళ్లిన వధువు
- భారత్‌కు ఒలింపిక్ కమిటీ షాక్
- ప్రాణం తీసిన పానీ పూరి
- మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు చేసిన అఫ్రిది
- రూ.35 లక్షలు చెల్లించిన మహేష్‌బాబు మల్టీప్లెక్స్
- ‘భారతీయుడు’ ఆగింది ఇందుకేనట..
- రాజధాని రైళ్లకు ఇక ‘పుష్-పుల్’
- అసలు కాజల్‌కు ఏమైంది.. ఆ ఫొటోలేంటి?
- ఆమె 3.2.. అతడు 5.4 అంగుళాలు
- మహిళ కంటిలో 15 సెం.మీ. నులిపురుగు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
