
తాజా వార్తలు
దిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. వివిధ జాతీయ పార్టీలు ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఎస్పీ నేత ములాయం, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్, శరద్ యాదవ్ తదితరులు దీక్షకు మద్దతు పలికారు. ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఎవరేమన్నారంటే..
చంద్రబాబు కృషికి సహకరిస్తాం: మన్మోహన్
‘‘భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తాం.’’
కేంద్రానిదే బాధ్యత: ఫరూక్
‘‘పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. అందుకే ఆంధ్రా ప్రజలు ఇక్కడి వరకు వచ్చారు. ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి కేంద్రం పాలించాలని చూస్తోంది. దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలి. వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారకూడదు. ప్రధాని అన్న వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.’’
మేమున్నాం: ములాయం
‘‘ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. చంద్రబాబు వెంట మేమంతా ఉంటాం. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా ఎస్పీ ఆయన వెంటన నడుస్తోంది. చంద్రబాబు వెంట రైతులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వారు న్యాయం కోసం పోరాడతారు. అవసరమైతే తిరగబడతారు.’’
హోదా గురించి మాత్రం ప్రధాని మాట్లాడరు: ఒబ్రెయిన్
‘‘పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. దానిపై ప్రధాని మోదీ ఒక్క మాట మాట్లాడరు. మోదీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గద్దె దిగే సమయం ఆసన్నమైంది. మోదీ, అమిత్ షా ఇద్దరూ దేశ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. తన ప్రసంగాల్లో మోదీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ దేశానికి మోదీ చేసిందేమీ లేదు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఆయన నిర్వీర్యం చేస్తున్నారు.’’
హామీలు నెరవేర్చే వరకు అండగా ఉంటాం: శరద్‌యాదవ్
‘‘ఏపీ ప్రజల ధర్మ పోరాట దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం. దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రైతులు, నిరుద్యోగులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రధానమంత్రి ప్రతిపక్షాల ఐక్యతను ప్రశ్నిస్తున్నారు. ఎమర్జెన్సీ హయాంలో కూడా ఇలాగే అన్ని పక్షాలు ఏకమయ్యాయి. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదలో పడింది. అందుకే విపక్షాలు ఏకమవుతున్నాయి. కోల్‌కతాలో మమతకు ఇలాంటి సంఘీభావమే తెలిపాం. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరం ఏపీ విభజన హామీలు నెరవేర్చే వరకు అండగా ఉంటాం.’’
అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్ట: కేజ్రీవాల్
‘‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇచ్చిన ప్రధాని మోదీ హామీలను అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసం చేశారు. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీని మించిన వారు లేరు. మోదీ ఒక పార్టీకి కాదు.. యావత్ దేశానికి ప్రధాని అన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. హక్కుల కోసం పోరాడితే సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. ఏపీ ప్రజల కోసం చంద్రబాబు చేస్తున్న ఈ పోరాటానికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తోంది.’’
మోదీకి బుద్ధి చెప్పేందుకు ఆంధ్రులు సిద్ధంగా ఉన్నారు: శరద్‌పవార్
‘‘రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రూ.వేలకోట్ల నష్టం వచ్చింది. రాష్ట్రానికి ఇస్తామన్న ఆర్తిక లోటును కేంద్రం భర్తీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో ఎన్డీయేతర పార్టీల సహకారం ఉంటుంది. ఐదేళ్ల ఎన్డీయే పాలనలో ఏపీకి ఇచ్చిందేమీ లేదు. దీంతో ప్రజలంతా ఆవేదన చెందుతున్నారు.’’
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
- వివాహం వద్దంటూ పీటలపై నుంచి వెళ్లిన వధువు
- భారత్‌కు ఒలింపిక్ కమిటీ షాక్
- ప్రాణం తీసిన పానీ పూరి
- మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు చేసిన అఫ్రిది
- రూ.35 లక్షలు చెల్లించిన మహేష్‌బాబు మల్టీప్లెక్స్
- ‘భారతీయుడు’ ఆగింది ఇందుకేనట..
- అసలు కాజల్‌కు ఏమైంది.. ఆ ఫొటోలేంటి?
- రాజధాని రైళ్లకు ఇక ‘పుష్-పుల్’
- మహిళ కంటిలో 15 సెం.మీ. నులిపురుగు
- ఆమె 3.2.. అతడు 5.4 అంగుళాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
