close

తాజా వార్తలు

నిహారిక వివాహంపై నాగబాబు స్పందన

పెళ్లి సంబంధాలు చూస్తున్నాం.. నాకు కులంతో పట్టింపులేదు

హైదరాబాద్‌: త్వరలోనే తన కుమార్తె నిహారిక పెళ్లి జరుగుతుందని, మంచి కుర్రాడి కోసం వెతుకుతున్నామని సీనియర్‌ నటుడు నాగబాబు అన్నారు. ఆయన తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా యాంకర్‌... నిహారిక గురించి ప్రశ్నించారు. దీంతో నాగబాబు ఆమె కెరీర్‌, పెళ్లి గురించి ముచ్చటించారు.‌ ఆమెకు నటించడం అంటే ఇష్టమని తెలిపారు.

‘‘నిహారిక తొలి సినిమా ‘ఒక మనసు’ అనుకున్నంత బాగా ఆడలేదు. తర్వాత తమిళంలో నటించింది, అది ఫర్వాలేదు. మూడో సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్‌’. అదీ పెద్దగా ఆడలేదు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మధ్యలో ‘ముద్దపప్పు’ సిరీస్‌లో నటించింది. అది సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడు ‘సూర్యకాంతం’ అనే సినిమా చేస్తోంది. ఆడపిల్లని నటనకు పంపాలా? వద్దా? అనుకుంటున్నప్పుడు తను.. ‘నేను నటిస్తా నాన్నా. సరైన కథలు ఎంచుకుంటాను. కుటుంబంలో మొత్తం నటులు ఉన్నప్పుడు నటించాలని నాకు ఎందుకు ఉండదు’ అంది. సరే అని ఒప్పుకున్నా. తనకు నేను ముందే చెప్పా రెండు, మూడేళ్ల తర్వాత పెళ్లి చేస్తానమ్మా అని.. సరే అంది. అయితే అల్లుడు ఎవరని ఇంకా ఏమీ అనుకోలేదు. సంబంధాలు వెతుకుతున్నాం. సినీ రంగం నుంచే కావాలనే ఆంక్షలు ఏమీ లేవు. మంచి గుణాలు, పద్ధతి ఉన్న కుర్రాడైతే చాలు. కుటుంబ నేపథ్యం కూడా బాగుండాలి. నాకు కులం, మతంతో పెద్ద పట్టింపులు లేవు. 2018 వరకు అమ్మాయికి టైమ్‌ ఇచ్చా. 2019 వచ్చింది.. మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేస్తా’ అని నాగబాబు అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.