
తాజా వార్తలు
భోపాల్: వైద్యుల నిర్లక్ష్యం, బాధ్యతారహిత మాటలు ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొన్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బుందేల్కండ్ వైద్య కళాశాలలో చోటు చేసుకుంది. అన్షికా అహిర్వార్ అనే చిన్నారికి ప్రమాదవశాత్తు వేడి నీళ్లు మీద పడడంతో గురువారం తీవ్రంగా గాయపడింది. తల్లిదండ్రులు వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాలని తల్లిదండ్రులు కోరారు. దీనికి స్పందించిన అక్కడి డాక్టర్ జ్యోతి రావత్ ఆసుపత్రిలో వెంటిలేటర్ లేదని.. మీ బిడ్డను బతికించాలంటే రూ.కోటి రూపాయలతో ఆసుపత్రిలో దానిని ఏర్పాటు చేయాలని ఆగ్రహంగా ఆదేశించారు. ఇంతలో ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. వీడియోను చూసి స్పందించిన అక్కడి అధికారులు వెంటనే డాక్టర్ జ్యోతిని సస్పెండ్ చేశారు. అయితే దీనిపై ఆసుపత్రి డీన్‌ను వివరణ కోరగా ఆసుపత్రిలో 17 వెంటిలేటర్లు ఉన్నాయని తెలిపారు. చిన్నారి బంధువు బ్రిజేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ‘‘మా పాపకు వైద్యులు సరైన చికిత్స అందించలేదు. ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో మేం అధికారులకు ఫిర్యాదు చేశాం. అనంతరం డా.జ్యోతి రావత్ చికిత్స చేయడానికి వచ్చారు. చిన్నారికి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాలని కోరారు. అయితే ఇక్కడ ఆ సదుపాయం లేదు... రూ.కోటితో వెంటిలేటర్‌ను ఏర్పాటు చేస్తే వైద్యం చేస్తాను అన్నారు’’ అని వారి మధ్య జరిగిన సంభాషణను వివరించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
- పది కిలోమీటర్ల దూరంలో ఇల్లు తీసుకుని..
- తండ్రి కారు కింద చితికిపోయిన చిన్నారి
- ‘రాక్షసులు మళ్లీ చెలరేగిపోయారు..చంపేయండి’
- కన్నబిడ్డ వివాహమైన కాసేపటికే
- ఉగ్రదాడిని ఖండిస్తూనే.. చైనా వక్రబుద్ధి
- మేడమ్.. నా పిల్లలకు తల్లి ఉంది
- 130 కోట్ల భారతీయులు దీటైన జవాబిస్తారు
- ప్రేమ వ్యవహారమే కారణమా?
- ఆస్ట్రేలియా సిరీస్‌కు కేఎల్ రాహుల్
- పుల్వామా దాడి గురించి ముందే హెచ్చరించారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
