
తాజా వార్తలు
పరిసరాల్ని ఎప్పుడూ మన కళ్లతో చూస్తూనే ఉంటాం... ఈ కెమెరా కళ్లు అంతరిక్షం నుంచి భూమిని చూశాయి... అదీ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసావి...
ఈ చిత్రాలన్నింటినీ ఓ పుస్తక రూపంలో నాసా తాజాగా విడుదల చుసింది... దానిపేరు ‘ఎర్త్’. భూమి, నీరు, ఆకాశం, వాతావరణం లాంటి అన్ని అంశాలూ పైనుంచి ఎలా కనిపిస్తాయో అందులో పొందుపరిచింది.
దాంట్లోని ఫోటోలే మన కనులకు విందు చేసేందుకు ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి!
* కెనడాలోని ఓ డెల్టా ప్రాంతంలో మంచు మధ్యలోంచి నీటి దారులిలా...
* ఐస్లాండ్లోని హోలుహ్రౌన్ లావా ఫీల్డ్ ఇది. అంతరిక్షంలోకి ఇలా లావాను కక్కుతూ ఎర్రగా దర్శనమిచ్చింది.
* మేఘాల మధ్యలోంచి కనిపిస్తున్నవి అలాస్కాలో ఉన్న ‘ది ఐలాండ్స్ ఆఫ్ ద ఫోర్ మౌంటేన్స్’.
* బామాస్లోని ఓ దీవిలో ఉన్న మంచులోకి చొచ్చుకెళ్లిన అలలు
* బ్లాస్టిక్ సముద్రంలో... కైనో బ్యాక్టీరియాల వల్ల ఏర్పడిన రంగులిలా చిత్రంగా కెమెరా కళ్లకు చిక్కాయి.
* చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులో నేల ఇలా ఎరుపు, పచ్చ, గోధుమ రంగులు కలగలిపి కనిపించింది.
* న్యూజీలాండ్‌లోని ఎగ్మౌంట్ నేషనల్ పార్కులో మన వేలి ముద్ర ఆకారంలో ఉన్న మౌంట్ తారనాకి.
* అంటార్కిటికాలో అత్యంత ఉప్పుతో నిండి ఉండే ప్రాంతం డాన్ జువాన్ పాండ్.
* మంగోలియాలోని ఎడారిలో ఎత్తయిన ఇసుక తిన్నెల మధ్యలో ఒదిగిపోయిన కొలనులిలా...
* అమెరికాలోని కొలరెడో నది పరీవాహక ప్రాంతం ఇలా...
* కెనడాలో లోయల్లో పచ్చికలపై పరుచుకున్న మంచు అచ్చం మేఘాల్లాగే దర్శనమిచ్చిందిలా...
* భూమి పై వాతావరణంలో వంపులు వంపులు తిరిగి అందంగా పరుచుకున్న మేఘాలు
* చైనా, కజకిస్థాన్ సరిహద్దుల్లోని పంటలు పండించే నేలలిలా...
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
