close

తాజా వార్తలు

బాలీవుడ్‌కు కీర్తి సురేశ్?

బోనీ కపూర్‌ చిత్రంలో నటించబోతున్నారట!

​​​​​​​

హైదరాబాద్‌: సినీ నటి కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారట. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించబోయే చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘బదాయి హో’ అనే చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్న అమిత్‌ శర్మ.. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. అయితే దీనిపై కీర్తి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ప్రాజెక్ట్‌ గురించి త్వరలో బోనీ కపూర్‌ స్వయంగా ప్రకటిస్తారని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎ.ఆర్.‌ మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కార్‌’ సినిమాతో కీర్తి వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత ఆమె నుంచి కొత్త సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు. మరోపక్క సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జోడీగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు గతంలో సినీ విశ్లేషకులు స్పష్టం చేశారు. ఎ.ఆర్‌. మురుగదాస్‌ తెరకెక్కించబోయే ఈ చిత్రంలో నయనతారతో పాటు కీర్తి సురేశ్ కూడా కథానాయికగా నటించనున్నారు. మలయాళీ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌తోనూ ఓ చిత్రంలో నటించనున్నారు ‘మహానటి’.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.