close

తాజా వార్తలు

నోట్లో వేలు... మానేదెట్లా?

ప్రశ్న: మా అబ్బాయి వయసు పదకొండేళ్లు. బొటనవేలు ఎప్పుడూ నోట్లో పెట్టుకుంటాడు. వద్దని చెప్పినా వినడు. ఈ అలవాటును ఎలా మాన్పించాలి?

- ఓ సోదరి

 

జవాబు: కొంతమంది పిల్లల్లో ఈ అలవాటు చిన్నతనంలో మొదలవుతుంది.  మానసికంగా కుంగుబాటుకు గురైన చిన్నారుల్లో అభద్రతాభావం ఉంటుంది. సాధారణంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువ. చిన్నతనంలో తల్లిదండ్రుల దగ్గర కాకుండా విడిగా వేరే గదుల్లో పడుకోబెట్టినప్పుడు లేదా అమ్మమ్మ, నానమ్మల దగ్గర నిద్రపోయే చిన్నారుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పిల్లలు మానసికంగా కుంగిపోయి అభద్రతకు గురవుతారు. వీరు నిద్రపోయేటప్పుడు అమ్మకు సంబంధించిన చీరో, దువ్వెనో, ఫొటోనో దగ్గర పెట్టుకుని నోట్లో వేలు వేసుకుని పడుకుంటారు.
ఇవి గమనించాలి: మీ అబ్బాయి మానసికంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నాడేమో ముందు తెలుసుకోవాలి. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉండొచ్చు. తల్లిదండ్రులు కళ్లముందే ఘర్షణ పడుతున్నా, చదువు విషయంలో ఏదైనా సమస్య ఉన్నా కూడా వారు అభద్రతకు గురవుతుంటారు. లేదా మరేదైనా సమస్య ఉందా అన్నది గమనించాలి. ఏదైనా వెంటనే సరిదిద్దడానికి ప్రయత్నించాలి. చదువులో వెనుకబడితే అదనంగా సమయం కేటాయించి శ్రద్ధ వహించండి. ఎక్కడ ఉన్నా...ప్రతిపనిలోనూ అతడికి మీరు అండగా ఉంటారనే భావన కలిగించాలి. స్కూల్లో ఇతర పిల్లలతో సమస్యలు వస్తే ధైర్యం చెప్పి, టీచర్‌తో మాట్లాడి సమస్య పరిష్కరించాలి. దీంతో భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లలు నోట్లో వేలు పెట్టుకున్నప్పుడు బాబుని విమర్శించడం, వెక్కిరించడం వల్ల మరింత కుంగిపోవచ్చు. దాంతో ఆ అలవాటు ఇంకా కొనసాగిస్తాడు. అందుకే  అతడి రెండు చేతులను ఎప్పుడూ బిజీగా ఉంచాలి. సంగీత వాద్యం నేర్పించడం, బొమ్మలు గీయడం వంటి తనకు ఇష్టమైన అంశంలో శిక్షణ ఇప్పించాలి. అప్పుడే మీ అబ్బాయిలో ఆందోళన తగ్గి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నోట్లో వేలు పెట్టుకోవడం తగ్గించిన కొద్దీ గుర్తించి ప్రశంసించాలి. ఇలా చేయడం వల్ల బాబుకు కూడా తన అలవాటును మానుకోవాలనే పట్టుదల వస్తుంది. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటే మానసిక నిపుణులకు చూపించాలి. అవసరమైతే మందులు సూచిస్తారు.

- మీ సందేహాలను ‌vasukid@eenadu.net కు పంపించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.