Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 69653
            [news_title_telugu_html] => 

రాజమౌళి చెప్పాక.. ఎగ్జైట్‌ అయ్యారట

[news_title_telugu] => రాజమౌళి చెప్పాక.. ఎగ్జైట్‌ అయ్యారట [news_title_english] => This is why Ajay devgn agreed to be part of rrr [news_short_description] => దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని... [news_tags_keywords] => Ajay Devgn,rrr,SS Rajamouli [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-19 18:59:59 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజమౌళి చెప్పాక.. ఎగ్జైట్‌ అయ్యారట - This is why Ajay devgn agreed to be part of rrr - EENADU
close

తాజా వార్తలు

రాజమౌళి చెప్పాక.. ఎగ్జైట్‌ అయ్యారట

హైదరాబాద్‌: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని ఇటీవల జక్కన్న  ప్రకటించారు. అయితే ప్రకటనకు ముందు ఈ సినిమాలో అజయ్‌ నటిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ సినిమాలో చేయడం లేదని అజయ్‌ మీడియాకు స్పష్టం చేశారు. అప్పుడు  అలా చెప్పిన ఆయన తర్వాత సంతకం చేయడానికి కారణం ఉందని చెబుతున్నాయి.

‘ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఈ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధులుగా కనిపించబోతున్నారు. అజయ్‌ కూడా స్వాతంత్ర్య సమరయోధుడిగానే నటిస్తున్నారు. తొలుత ఈ సినిమా విషయంలో అజయ్‌ కచ్చితంగా లేరు. ఎందుకంటే ఆ పాత్ర స్క్రీన్‌ టైమ్‌ తక్కువ. అందుకే చేయడానికి పూర్తిగా సిద్ధపడలేదు. కానీ రాజమౌళి పాత్రను నరేట్‌ చేసిన తర్వాత అజయ్‌ చాలా ఎగ్జైట్‌ అయ్యారు. నటించాలని నిర్ణయించుకున్నారు. అన్నీ ఓ క్రమపద్ధతిలో కుదిరాయి’ అని అజయ్‌ సన్నిహితులు చెప్పినట్లు తెలుస్తోంది.
‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకుల పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ఆలియా భట్‌,  డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ కథానాయికలు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దానయ్య నిర్మాత. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నీ భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.