close

తాజా వార్తలు

గతం కన్నా పెరిగిన ప్రవాసాంధ్ర ఓటర్ల నమోదు

ఇంటర్నెట్‌డెస్క్‌ : సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఎక్కడెక్కడి నుంచో  తరలి రావడం సహజం. విదేశాల నుంచి ఈసారి ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీలాంటి దేశాల్లో నివసిస్తున్న వారిలో 5,323 మంది ప్రవాసాంధ్రులు ఫారం-6ఏ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తులను ఈసీ అంగీకరించి ఓటుహక్కు కల్పించింది. ఈ ప్రవాసాంధ్రులు ఆన్‌లైన్‌ ద్వారా ఓటు వేయవచ్చంటూ  సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను మాత్రం ఈసీ ఖండించింది.  ఒరిజినల్‌ పాస్‌పోర్ట్‌తో మాత్రమే వారికి నిర్దేశించిన  పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేయవచ్చని స్పష్టంచేసింది. 2014 ఎన్నికలతో పొల్చితే ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రవాసాంధ్రుల సంఖ్య రెండింతలు పెరిగిందని  ఎన్నికల సంఘం వెల్లడించింది.

2019 జనవరి 11వ తేదీన విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ప్రవాసాంధ్రులు 2,520 గా నమోదు కాగా.. తాజాగా ఈసీ ప్రకటించిన అనుబంధ జాబితా తర్వాత వీరి సంఖ్య 5,323కి పెరిగింది. ఈ కొత్త జాబితాలో నమోదైన వారిలో 1,068 మంది ఓటర్లు కడప జిల్లాలో ఓటు వేయనున్నారు. గుంటూరు జిల్లాలో 879, కృష్ణా జిల్లాలో 839 మంది ప్రవాసాంధ్ర ఓటర్లు నమోదయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 509, పశ్చిమగోదావరి జిల్లాలో 587, విశాఖ జిల్లాలో 394, ప్రకాశం జిల్లాలో 324, నెల్లూరు జిల్లాలో 203, కర్నూలు జిల్లాలో 104, చిత్తూరు జిల్లాలో 261, విజయనగరం జిల్లాలో 59 మంది ప్రవాసాంధ్రులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కనిష్ఠంగా శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో 48 మంది చొప్పున నమోదు చేసుకున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.