close

తాజా వార్తలు

పెళ్లిలో ‘ఓటు’ ప్రమాణం

కాన్పూర్‌(ఉత్తరప్రదేశ్‌): ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివాసి కల్యాణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో 11 జంటలు ఒకే సమయంలో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యాయి. అయితే ఈ సామూహిక వివాహ వేడుకలో ఒక వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పెళ్లిలో వరుడు, వధువుతో చేయించే ఏడు ప్రమాణాలతో పాటు ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని కూడా ప్రమాణం చేయించారు. ‘ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాం. సాధారణంగా పెళ్లిలో ఏడు ప్రమాణాలు చేయిస్తారు. కానీ ఈ రోజు ఈ 11 జంటలతో ఎన్నికల్లో ఓటేస్తామని ఎనిమిదో ప్రమాణాన్ని కూడా చేయించాం’ అని సంఘం అధ్యక్షుడు మనోజ్‌ కుమార్‌ తెలిపారు. కొత్తగా పెళ్లైన ఈ జంటలకు సంఘం తరఫున నిర్వాహకులు మంచాలు, ఫ్రిజ్‌లు బహుమానంగా అందించారు. దేశంలో ఏప్రిల్‌ 11 నుంచి మే 19వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.