close

తాజా వార్తలు

తొలిసారి మానవాళి ముందుకు కృష్ణబిలదృశ్యం

 


వాషింగ్టన్‌: కృష్ణబిలానికి(బ్లాక్‌హోల్‌) చెందిన చిత్రం తొలిసారి మానవాళి ముందు ఆవిష్కృతమైంది. ది ఈవెంట్‌ హొరైజన్‌ టెలిస్కోప్‌(ఈహెచ్‌టీ), సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌ డైరెక్టర్ షెప్ డోలెమ్యాన్ ఈ చిత్రాన్ని విడుదల చేశాయి. నేషనల్‌ సైన్స్ ఫౌండేషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆమెరికా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రపంచం ఈ దృశ్యాన్ని వీక్షించింది. ఆ చిత్రం అత్యంత అద్భుతంగా, క్లిష్టంగా కనిపించింది. 
భూమికి అత్యంత దూరంలో ఉన్న ఎం87 గెలాక్సీలో ఈ కృష్ణబిలం కేంద్రీకృతమైంది.  కృష్ణబిలంపై ప్రయోగాలు చేపట్టేందుకు రూపొందించిన ‘ఈవెంట్‌ హొరైజన్‌ టెలిస్కోపు’ (ఈహెచ్‌టీ) బ్లాక్‌ హోల్‌ చిత్రాన్ని క్లిక్‌మనిపించింది. ఈహెచ్‌టీలో భాగంగా భూమి మీద అమర్చిన మల్టిపుల్ అబ్జర్వేటరీ టెలిస్కోపులు ఈ దృశ్యాన్ని చిత్రీకరించాయి.  ఆ చిత్రంలో కృష్ణ బిలం నీడ కనిపిస్తుందని  నేషనల్‌ సైన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. ఆ కృష్ణబిలం నీడను సంగ్రహించడం అత్యంత కష్టమని శాస్త్రవేత్తలు చెప్పారు. కృష్ణబిలం దృశ్యాన్ని చిత్రీకరించడం శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి సంక్షిష్ట పదార్థాల గురించి అర్థం చేసుకొని, మరిన్ని విషయాలు వెలుగులోకి తేవడానికి ఈ ఆవిష్కరణ దోహదం చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.