close

తాజా వార్తలు

వంతెనపై ఓటరు అవగాహన కార్యక్రమం 

చెన్నై : ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచిస్తూ తమిళనాడులో భారీ మానవహారం నిర్వహించారు. దేశభవిష్యత్‌ను నిర్ణయించే ఓటు విలువను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామేశ్వరంలోని పంబన్‌ వంతెనపై ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది ఉద్యోగులు, నౌకాదళ అధికారులు, చిన్నారులు భాగస్వాములు అయ్యారు. ఓటింగ్‌లో తప్పక పాల్గొంటామని ప్రమాణం చేశారు. తమిళనాడులోని రామంతపురం నియోజకవర్గం పరిధిలో 100 శాతం పోలింగ్‌ నమోదు చేయించడమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.