close

తాజా వార్తలు

పెళ్లిలో చిందేసిన రకుల్‌.. పాట వైరల్‌

‘దే దే ప్యార్‌ దే’.. పాట చూశారా!

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కథానాయకుడిగా నటించిన సినిమా ‘దే దే ప్యార్‌ దే’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, టబు కథానాయికలు. ఇందులో అజయ్‌ ప్రియురాలిగా రకుల్‌, ఆయన మాజీ భార్యగా టబు నటించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. కాగా ఈ సినిమాలోని పాటను తాజాగా విడుదల చేశారు. ‘వడ్డీ షరాబన్‌..’ అని సాగే ఈ పాటలో రకుల్‌ స్టెప్పులేస్తూ, సందడి చేశారు. ఓ పెళ్లిలో ఆమె చిందేస్తూ కనిపించారు. ఎంతో హుషారు సాగిన ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే 9 లక్షల మందికిపైగా యూట్యూబ్‌లో వీక్షించడం విశేషం. సునిధీ చౌహాన్‌, నవ్‌రాజ్‌ హన్స్‌ ఈ పాటను ఆలపించారు. విపిన్‌ పట్వా సంగీతం అందించారు.
‘‘వడ్డీ షరాబన్‌..’ షూటింగ్‌ ఎంతో సరదాగా జరిగింది.. ఇది ఓ గొప్ప అనుభవం. ఇంత చక్కటి పాటను నాకిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని రకుల్‌ ట్వీట్‌ చేశారు. అకీవ్‌ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టీ సిరీస్‌ సంస్థ నిర్మించింది. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.