
తాజా వార్తలు
గూగుల్, ఆపిల్ యాప్ స్టోర్ల నుంచి తొలగింపు
న్యూదిల్లీ: చైనాకు చెందిన వీడియో యాప్ ‘టిక్‌టాక్’పై విధించిన నిషేధం కొనసాగుతుందని మద్రాసు హైకోర్టు మరోసారి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గూగుల్, ఆపిల్ యాప్ స్టోర్ల నుంచి దీన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో భారత్‌లో ఆ రెండు యాప్ స్టోర్ల నుంచి ఈ యాప్‌ను తొలగించారు. స్మార్ట్ఫోన్లలో ప్రత్యేక ఫీచర్లతో యూజర్లు ఈ యాప్ ద్వారా చిన్నపాటి వీడియోలను తీసుకుని, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసేవారు. అయితే దీన్ని కొందరు దుర్వినియోగం చేస్తూ చిన్నారులను లక్ష్యంగా చేసుకుని లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అభ్యంతరాలు వచ్చాయి. భారత్‌లోనూ ఈ యాప్ చాలా ప్రజాదరణ పొందింది. అయితే, ప్రస్తుతం దీనిపై పలువురు రాజకీయ నేతలు కూడా అభ్యంతరాలు చెబుతున్నారు.
ఈ యాప్ యువతను తప్పుదారి పట్టిస్తోందని, దీని కారణంగా పలువురు ఆత్మహత్య చేసుకున్నారని తెలుపుతూ.. వెంటనే నిషేధం విధించాలని మదురైకి చెందిన ముత్తుకుమార్ అనే న్యాయవాది గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దీన్ని నిషేధిస్తూ గతంలోనే న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే, తీర్పును వ్యతిరేకిస్తూ ఆ యాప్ ప్రతినిధులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. వారి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మదురై ధర్మాసనంలో కేసు మంగళవారం మరోసారి విచారణకు వచ్చిన నేపథ్యంలో ఈ యాప్‌పై నిషేధం కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో అందుకు తగ్గట్లు ప్రభుత్వం గూగుల్, ఆపిల్ సంస్థలకు లేఖలు రాయడంతో ఈ యాప్‌లను వాటిల్లోంచి తొలగించినట్లు తెలుస్తోంది. ‘టిక్‌టాక్’పై నిషేధం విధించిన నేపథ్యంలో ట్విటర్ వేదికగా దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
