close

తాజా వార్తలు

రూ.2 కోట్ల విలువైన ‘అవెంజర్స్‌’ కారును చూశారా..

లాస్ఏంజెల్స్‌: ప్రముఖ హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ డౌనీ జూనియర్.. ‘అవెంజర్స్‌:  ఎండ్‌గేమ్’ చిత్రంలోని తన సహ నటుడైన క్రిస్‌ ఇవాన్స్‌కు ఖరీదైన కారును కానుకగా ఇచ్చారు. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్’ చిత్రం 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో డౌనీ, ఇవాన్స్‌ కీలక పాత్రలు పోషించారు. 
ఈ నేపథ్యంలో డౌనీ ‘అవెంజర్స్’లో ఇవాన్స్‌ నటించిన కెప్టెన్‌ అమెరికా పాత్రకు సంబంధించిన ఫీచర్లతో 1967 షెవ్రాలే కమారో కారును డిజైన్‌ చేయించారు. దీని ధర 275,000 డాలర్లు. ఈ కారు స్టీరింగ్‌ కెప్టెన్‌ అమెరికా షీల్డ్‌ రూపంలో ఉండటం విశేషం. ‘అవెంజర్స్‌’ సిరీస్‌ నుంచి వస్తున్న చివరి సూపర్‌హీరో చిత్రమిదని హాలీవుడ్‌ వర్గాల సమాచారం. అందుకే డౌనీ ఈ కారును ఇవాన్స్‌కు కానుకగా ఇవ్వాలని 2018లోనే నిర్ణయించుకున్నారట. అమెరికాలోని విస్కన్సిన్‌ ప్రాంతానికి చెందిన స్పీడ్‌కోర్‌ అనే కారు డిజైనింగ్‌ స్టోర్‌ దీనిని రూపొందించిందట. ఈ కారుకు అమర్చిన చక్రాలు, సస్పెన్షన్‌, ఇంజిన్‌, సీట్స్‌, సూపర్‌ఛార్జర్‌ల ధరే 33,000 డాలర్లు ఉంటుందని స్పీడ్‌కోర్‌ అధికార ప్రతినిధి ఎడ్మండ్స్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 
‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ చిత్రానికి రుస్సో బ్రదర్స్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ సినిమా విడుదల కాబోతోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.