
తాజా వార్తలు
ముంబయి: తన అసిస్టెంట్ ప్రభాకర్‌ను తలచుకుని బాలీవుడ్ నటి సన్నీ లియోని కంటతడి పెట్టారు. ఆయన మూత్రపిండాల సమస్యతో మృతి చెందారు. ప్రభాకర్ ఆరోగ్య పరిస్థితి గురించి 2018లో సన్నీ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అతడికి తమ వంతుగా రూ.20 లక్షలు సహాయం చేశామని, నెటిజన్లు కూడా ఆదుకోవాలని పేర్కొన్నారు. దీంతో అప్పట్లో సన్నీని నెటిజన్లు ఎటాక్ చేశారు. ‘సన్నీ రూ.1.38 కోట్ల విలువైన కారు కొనుకోలు చేశారు కానీ ప్రభాకర్ చికిత్సకు మాత్రం రూ.20 లక్షలు మాత్రమే ఇవ్వగలిగారు.. ఆమె పాదరక్షకాల విలువే రూ.20 లక్షల వరకు ఉంటుంది, అలాంటి ఆమె విరాళం అడుగుతున్నారు..’ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. దీని గురించి అర్బాజ్ ఖాన్ షోలో సన్నీ తాజాగా మాట్లాడారు. నెటిజన్ల కామెంట్లు, ప్రభాకర్‌ను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. అతను తన కుటుంబంలోని వ్యక్తిలాంటి వారని ఆవేదన చెందారు.
‘నేను పోస్ట్ చేయకముందు నుంచే ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. నేను, డేనియల్ (సన్నీ భర్త) అతడి ఆర్థిక అవసరాల్ని చూసుకునేవాళ్లం. అతడి వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చు మొత్తం మేం భరించాం. మనకు బాగా కావాల్సిన వ్యక్తి చనిపోబోతున్నాడు, కానీ అతడికి సాయం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు తీవ్ర ఆవేదనకు గురి అవుతాం. అతడు చాలా ఏళ్లు ఈ చిత్ర పరిశ్రమలో పనిచేశారు కాబట్టి ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. నేను సహాయం అడిగింది వైద్యం కోసం కాదు.. అతడి కుటుంబ సభ్యుల అవసరాల కోసం. అతడి కోసం మేం చాలా చేశాం. కానీ కాపాడుకోలేకపోయాం. అతడ్ని చాలా మిస్ అవుతున్నాం. ప్రజలు ఏం అనుకుంటున్నారనేది నాకు అనవసరం. నా దగ్గర వంద మిలియన్ డాలర్లు ఉన్నాయి అనుకుంటున్నారు’ అని సన్నీ పేర్కొన్నారు
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- పథకం ప్రకారమే బూటకపు ఎన్కౌంటర్
- వాంఖడేలో రికార్డుల మోత!
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఎన్‌కౌంటర్‌పై సుప్రీం విచారణ కమిషన్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
