close

తాజా వార్తలు

మీ కారును చల్లగా చూసుకోండి ఇలా..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: సరైన జాగ్రత్తలు లేకుండా వేసవిలో కారు ప్రయాణాలు చేస్తే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కారు క్యాబిన్‌  విపరీతంగా వేడెక్కి భరించలేని స్థితికి చేరుతుంది. ఇక ఆరు బయటే పార్కింగ్‌ చేసి ఉంచిన కారులో ప్రయాణించాలంటే అది నరకంతో సమానం. అదే సమయంలో కారు  నీడగా ఉన్న చోట పార్కింగ్‌ చేసినా వేడి గాలి కారణంగా ఏసీ ఎక్కువసేపు ఉండదు. క్యాబిన్‌ వెంటనే వేడెక్కితుంది. వేసవిలో కారును చల్లగా  ఉంచాలంటే కొన్ని చిన్న చిట్కాలను పాటించాల్సి ఉంటుంది..
ఏసీ ఫిల్టర్లను శుభ్రపర్చుకోవాలి..
వేసవి రావడానికి ముందే కారు ఏసీ ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి. అవసరమైతే మార్చేసి కొత్తవి వేసుకోవాలి. ఇలా చేస్తే ఏసీ కూడా ఎక్కువకాలం మన్నుతుంది. దుమ్ముకొట్టుకుపోయిన ఏసీ.. కారు క్యాబిన్‌లో ఉష్ణోగ్రతను తగ్గనివ్వదు. దీనికి తోడు ఇంధన వినియోగాన్ని గణనీయంగా పెంచేస్తేంది. ఏసీ ఫిల్టర్లను ఎప్పుడు మార్చాలో మీ కారు మ్యాన్యూవల్‌లో కచ్చితంగా ఉంటుంది. ఒక సారి చదివితే చాలు.
రీసర్క్యిలేషన్‌ మోడ్‌ను వాడాలి..
ఒక సారి క్యాబిన్‌ చల్లబడ్డాక రీసర్క్యిలేషన్‌ మోడ్‌ను ఆన్‌ చేయాలి. అప్పుడు కారు బయటినుంచి గాలిని లోపలికి పంపదు. క్యాబిన్‌లోని గాలినే పునర్‌ వినియోగిస్తుంది. అప్పటికే అక్కడి గాలి చల్లగా ఉండటంతో ఏసీపై భారం తగ్గుతుంది. 

నిదానంగా ఏసీని పెంచాలి..
మనం సాధారణంగా ఎండలో నుంచి కారులోకి రాగానే వెంటనే ఏసీని ఫుల్‌లో పెట్టి ఆన్‌ చేస్తాము. ఇది కారుకు, ఆ వ్యక్తికి ఇద్దరికీ మంచిది కాదు. కారు ఏసీపై ఒక్కసారిగా ఒత్తిడి తీసుకురాకూడదు. తొలుత కారు అద్దాలను పూర్తిగా దింపేసి డ్రైవింగ్‌ మొదలు పెట్టాలి. వేడిగాలి మొత్తం బయటకు పోయాక అప్పుడు ఏసీని ఆన్‌ చేయాలి. నెమ్మదిగా ఉష్ణోగ్రతను తగ్గిస్తూ పోవాలి. లేకపోతే ఇంధనం అదనంగా ఖర్చుకావడం మినహా మరే ప్రయోజనం ఉండదు. 
ఏసీని ఆపటం మరవద్దు..
కారు ఇంజిన్‌ను ఆపేసేందుకు కొద్దిసేపు మందు ఏసీని అపివేయాలి. అప్పుడు ఫ్యాన్‌ ఒక్కటే పనిచేస్తుంది. అప్పుడు క్యాబిన్‌లో మిగిలిన పొడిగాలిని ఫ్యాన్‌ బయటకు లాగేస్తుంది. దీంతో మరికొన్ని నిమిషాలు అదనంగా కారు చల్లగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. 
ఫ్లూయిడ్స్‌ను సరిచూసుకోవాలి..
సమయానికి సర్వీస్‌ చేయిస్తే భారీ ఖర్చులను మిగుల్చుకోవచ్చు. వేసవికి ముందు సర్వీసు చేసి ఇంజిన్‌, ఏసీలో ఉండాల్సిన నిల్వలను సరిచూసుకోవాలి. కారు కూలెంట్‌, రిఫ్రిజిరెంట్‌ వ్యవస్థల పనితీరును చెక్‌ చేసుకోవాలి. వాహనాన్ని టాప్‌అప్‌ చేసుకోవడానికి ఒక నీటి సీసాను అందుబాటులో ఉంచుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కూలెంట్‌ కొంత అందుబాటులో ఉంచుకోవాలి. 
పిల్లలను, పెంపుడు జంతువులను కారులో ఉంచొద్దు..
కారును ఆరుబయట నిలపాల్సి వచ్చినప్పుడు పిల్లలను , పెంపుడు జంతువులను కారులో ఉంచొద్దు.  ఎండ కారణంగా కారులో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటితే ప్రమాదాలు జరగవచ్చు. ఒక వేళ ఉంచాల్సి వస్తే కారులో ఏసీ లేదా ఫ్యాన్‌ను ఆన్‌ చేయాలి, కారు అద్దాలను కిందకు దింపాలి. 

ఆరబయటే పార్కింగ్‌ చేసే వాహనంపై కనీసం తెల్లటి కవర్‌ను కప్పాలి. నల్లటి కవర్లను కప్పడం వల్ల కారు క్యాబిన్‌లో ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.