
తాజా వార్తలు
అదెట్టా?
నెట్టిల్లు.. ఫోన్.. దేంట్లోనైనా నిత్యం వాడే సర్వీసులు కొన్ని ఉంటాయ్! వాటిల్లో దాగున్న కొన్ని ఆప్షన్లు చిత్రంగా అనిపిస్తాయ్! అలాంటివి మీకు తెలుసా? అబ్బే.. లేదంటారా? వీటిని ప్రయత్నించండి. బోర్ అనిపిస్తే.. ఫుల్ టైమ్‌పాస్!
గూగుల్ గూట్లో...
ఎప్పుడూ ఏదోటి వెతకడమేనా? సరదాకి వీటిని ప్రయత్నించండి. సెర్చ్‌బాక్స్‌లో askew కమాండ్ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. సెర్చ్ ఫలితాలు చిత్రంగా కనిపిస్తాయ్ చూడండి.
* సిస్టమ్‌పై పని ఒత్తిడి ఎక్కువైతే కాసేపు గూగుల్ సెర్చ్బాక్స్లోనే ధ్యానం చేయండి. అందుకు సెర్చ్‌బాక్స్‌లో breathing exercise కమాండ్ని టైప్ చేయండి. ఒక నిమిషం పాటు శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయొచ్చు.
* రిలాక్స్ కోసం కాసేపు స్పిడ్జెట్ని తిప్పొచ్చు. అందుకు spinner కమాండ్ని సెర్చ్‌బాక్స్‌లో టైప్ చేయండి. మౌస్తో స్పిడ్జెట్ని తిప్పొచ్చు.
* ఏదైనా ఆటలో టాస్ వేయడానికి కాయిన్ లేకపోతే. గూగుల్‌లో Flip a coin కమాండ్ని వాడొచ్చు.
* ఎప్పుడూ పనేనా? కాసేపు గేమ్స్ ఆడదాం అనుకుంటే? గూగుల్ సెర్చ్‌లోనే ఆడొచ్చు. snake game ఒకటి. పండు కోసం పాముని ఆడించండం.
* మెదడుకి పదును పెట్టే పజిల్ గేమ్ tic tac toe.’. టైప్ చేసి ఎంటర్ నొక్కితే చాలు.
* క్విజ్ ఆడదాం అనుకుంటే ’earth day quiz ఉంది.
ఫేస్బుక్ తెరవండి
ఎప్పుడూ ఎఫ్బీలో లైక్, కామెంట్ చేస్తుంటారు. కానీ, పేజీని ఇతరులకు అర్థం కాకుండా భిన్నంగా మార్చే ప్రయత్నం చేశారా? అంటే.. భాషని తల్లకిందులు చేయడం. సాధారణ స్థితిలో ఉన్న ఇంగ్లిష్ భాషని తల్లికిందులుగా మార్చేయడం అన్నమాట. దీనికి సెట్టింగ్స్‌లోకి వెళ్తే ‘లాంగ్వేజీ’ ఆప్షన్ కనిపిస్తుంది. సెలెక్ట్ చేసి ఉన్న భాషలు అన్నీ కనిపిస్తాయి. వాటిల్లో ‘ఇంగ్లిష్ అప్‌సైడ్ డౌన్’ సెలెక్ట్ చేసుకుని ‘సేవ్ చేంజెస్’ క్లిక్ చేస్తే భాష ఫ్లిప్ అవుతుంది. ఎఫీబీలోకి మొత్తం కమాండ్స్ తల్లకిందులవుతాయి. స్నేహితుల్ని ఆట పట్టించేందుకు సెట్టింగ్స్‌ని ఇలా మార్చేయొచ్చు. తిరిగి ఎప్పటిలా మార్చేసుకోవచ్చు.
* కొన్ని ప్రత్యేక వాక్యాల్ని టైప్ చేయడం ద్వారా యానిమేషన్ ఎఫెక్ట్‌లను కామెంట్లకు జత చేయొచ్చు. వాటిల్లో oxox, Best wishes, Wonderful time, Congrats, Congratulation, you are the best. కొన్ని. వీటిని టైప్ చేస్తే హెచ్‌టీఎంఎల్ భాషలా టెక్స్ట్ హైలైట్ అవుతుంది. దానిపై క్లిక్ చేసి యానిమేషన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది.
* మెసెంజర్‌తో స్నేహితులతో ఛాట్ చేస్తూనే గేమ్ ఆడొచ్చు తెలుసా? ఎమోజీల్లో బాస్కెట్ బాల్ని పంపాలి. సెండ్ చేసిన బాల్‌పై రెండు సార్లు ట్యాప్ చేస్తే బాస్కెట్ బాల్ గేమ్ ఓపెన్ అవుతుంది. ఇదేమాదిరిగా ఫుల్బాల్ని పంపి గేమ్ ఆడొచ్చు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
