close

తాజా వార్తలు

తప్పు అలా అనొద్దు: ప్రియాంకా గాంధీ

అమేఠీ(యూపీ): మంగళవారం అమేఠీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి మద్దతుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ నిర్వహించిన ప్రచారంలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఆమె ప్రచారంలో కొంతమంది చిన్నారులు కాంగ్రెస్‌ టోపీలు పెట్టుకొని ఆ పార్టీకు మద్దతుగా నినాదాలు చేయడం ఆమె గమనించి వారి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా చిన్నారులు ‘ చౌకీదార్‌ చోర్‌ హై ’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. పిల్లలు ఇలా మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. అలా వారిని చూస్తూ ఉండిపోయారు. తరువాత పిల్లలు మోదీపై ఓ అనుచిత వ్యాఖ్య చేశారు. వెంటనే ఆమె కలగజేసుకొని అలా మాట్లాడకూడదని పిల్లలని వారించారు. ‘ ఇది సరైన పద్ధతి కాదు. మంచి పిల్లలుగా మెలగండి ’ అంటూ ఆ చిన్నారులకు హితబోధ చేశారు. వెంటనే పిల్లలంతా ‘ రాహుల్‌ గాంధీ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి, అమేఠీ భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ షేర్‌ చేస్తూ ‘ మీరు ప్రధానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో చూడండి ’ అంటూ ట్వీట్‌ చేశారు. పిల్లలు మోదీని తిట్టిన వరకే స్మృతి షేర్‌ చేసిన వీడియోలో ఉండడం గమనార్హం. అయితే మోదీని దుర్భాషలాడిన చిన్నారులను వద్దని వారించిన ప్రియాంకను పలువురు ప్రశంసిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో ‘ చౌకీదార్ చోర్‌ హై ’ అంటూ ప్రధాని మోదీపై రాహుల్‌ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.