close

తాజా వార్తలు

భూమికి అత్యంత సమీపంలోకి భారీ గ్రహ శకలం!

టెలిస్కోప్‌ సహాయం లేకుండా నేరుగా చూడొచ్చు


వాషింగ్టన్‌ : ఓ భారీ గ్రహ శకలం మరో పదేళ్లలో భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. 2029 ఏప్రిల్‌లో ‘అపోఫీస్‌’ అనే గ్రహశకలం భూమికి కేవలం 19 వేల మైళ్ల దూరం నుంచి వెళ్లనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ గ్రహశకలాన్నిటెలిస్కోప్‌ సహాయం లేకుండానే భూమిపై నుంచి  చూడొచ్చని చెబుతున్నారు.

చాలా గ్రహశకలాలు  భూమికి సమీపంలోకి వచ్చి వెళ్తుంటాయి. అయితే అవి సాధారణంగా చంద్రుని కంటే దగ్గరగా రావు. కానీ అఫోపిస్‌ మాత్రం భూగ్రహానికి అత్యంత సమీపంలోకి రానుంది. వెయ్యి అడుగుల పొడవుండే ఈ భారీ శకలం వేగంగా వెళ్తూ భూమిని దాటుతున్నప్పుడు దాన్ని చూడటానికి  ఎలాంటి పరికరం అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అత్యంత సమీపంలోంచి ఇది వెళ్తున్నప్పటికీ.. దీని వల్ల భూమికి ఎలాంటి నష్టం వాటిల్లదని వివరిస్తున్నారు.

ఈ గ్రహ శకలంపై పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. ఇది తమకు లభించిన గొప్ప అవకాశంగా వారు భావిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.