close

తాజా వార్తలు

‘బాండ్‌’ కారు మారింది..!

లాస్‌ఏంజెల్స్‌: ‘జేమ్స్‌ బాండ్‌’ సిరీస్‌ నుంచి 25వ చిత్రం సిద్ధం అవుతోంది. ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. అయితే ఈ చిత్రంలో బాండ్‌ వాడే కారు మారింది. హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ క్రెయిగ్‌ (జేమ్స్‌ బాండ్‌) నటించిన 24 బాండ్‌ చిత్రాల్లో ఆస్టన్‌ మార్టిన్‌ కారునే వాడారు. కానీ ఈ 25వ చిత్రంలో మాత్రం ఆయన ల్యాండ్‌ రోవర్‌ సిరీస్‌ 3 ఓపెన్‌ టాప్‌ కారును వాడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జమైకాలో చిత్రీకరణ జరుగుతోంది. సెట్స్‌లో డేనియల్‌ రేంజ్‌ రోవర్‌ కారును నడుపుతున్నప్పుడు తీసిన ఫొటో ఒకటి బయటికి వచ్చింది. అయితే ఓ ఏజెంట్‌గా బాండ్‌ క్రిమినల్స్‌ను పట్టుకోవాలంటే ఆస్టన్‌ మార్టిన్‌ కారు కాకుండా ఇలాంటి రేంజ్‌ రోవర్‌ సరిపోదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాలో గత చిత్రాల్లో నటించిన జెఫ్రీ రైట్‌, బెన్‌ విషా, రాల్ఫ్‌ ఫీన్స్‌, నావోమీ హారిస్‌ కూడా ఉన్నారు. విలన్‌ పాత్రలో ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ‘బొహెమియన్‌ రాప్సోడీ’ ఫేం రామీ మలెక్‌ నటించబోతుండడం విశేషం. ఈ చిత్రంలో రామీ మలెక్‌ పాత్ర విభిన్నంగా, పవర్‌ఫుల్‌గా ఉండబోతోందట. భయంకరమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఆయుధాలు కలిగి ఉన్న ప్రతినాయకుడి పాత్రలో రామి నటించబోతున్నారు. ఈ చిత్రానికి నీల్‌ పూర్విస్‌, రాబర్ట్‌ వేడ్‌, స్కాట్‌ బర్న్స్‌, ఫీబీ వాల్లర్‌ కథ రాశారు. సినిమాకు కేరీ దర్శకత్వం వహించనున్నారు. జమైకా, నార్వే, లండన్‌, ఇటలీలో సినిమాను చిత్రీకరిస్తున్నారు. సినిమాలో అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్‌ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే కథ ఉండబోతోందని హాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.