
తాజా వార్తలు
దిల్లీ : భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న చంద్రయాన్-2కు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. జులై 9 నుంచి 16 మధ్యలో చేపట్టనున్న ఈ ప్రయోగం ద్వారా.. మొత్తం భారత్‌కు చెందిన 14 పేలోడ్స్‌ను చంద్రునిపైకి పంపనున్నట్లు ఇస్రో తెలిపింది.
3,800 కేజీల బరువుండే వాహకనౌకలో ఒక ఆర్బిటర్, ఐదు కాళ్ల ల్యాండర్, రోబోటిక్ రోవర్ ఉండనున్నాయి. ఆర్బిటర్ చంద్రుని ఉపరితలం నుంచి 100 కి.మీ దూరంలో తిరగనుండగా.. ‘విక్రమ్’గా నామకరణం చేసిన ల్యాండర్ సెప్టెంబర్ 6 నాటికి చంద్రునిపై కాలుమోపనుంది. ‘ప్రజ్ఞాన్’గా పిలిచే రోబోటిక్ రోవర్ చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయనుంది.
ఈ మూడు మాడ్యూళ్లు పేలోడ్స్‌ను మోసుకెళ్తాయని ఇస్రో తెలిపింది. ఆర్బిటర్ ఒక్కటే 8 పేలోడ్స్‌ను మోసుకెళ్లగా.. ల్యాండర్ 4, రోవర్ రెండింటిని తీసుకెళ్లనుంది. అయితే ఇటీవల 13 పేలోడ్స్ అని చెప్పగా.. తాజాగా 14 పేలోడ్స్‌ను చంద్రయాన్-2 మోసుకెళ్లనుందని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-1 విదేశాలకు చెందిన పేలోడ్స్‌ను కూడా మోసుకెళ్లగా.. ఈ ప్రయోగం ద్వారా కేవలం భారత్‌కు చెందిన పేలోడ్స్నే తీసుకెళ్లనున్నారు.
ఈ మూడు మాడ్యూళ్లను శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ ఎం.కె-3 లాంచ్ వెహికల్తో ప్రయోగిస్తారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే తొలి ప్రయత్నంలోనే దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ప్రాజెక్టుగా చంద్రయాన్-2 నిలవనుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- మరోసారి నో చెప్పిన సమంత
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
