close

తాజా వార్తలు

చంద్రుడిపై మహిళను దించే ‘ఆర్టెమిస్‌’

వాషింగ్టన్‌: చంద్రుడిపైన మహిళా వ్యోమగామిని దించేందుకు చేపట్టిన ప్రాజెక్టుకు అమెరికా అంతరిక్ష సంస్థ ‘ఆర్టెమిస్‌’ అని పేరు పెట్టింది. అయితే 2024లో చేపట్టదలచిన ఈ ప్రతిష్ఠాత్మక యాత్ర కోసం ఆ సంస్థ ఇంకా నిధుల వేటలో ఉంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును 2028లో సాకారం చేయాలని నాసా అనుకుంది. అయితే ఈ ఏడాది మార్చిలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం దాన్ని నాలుగేళ్ల ముందుకు జరిపింది. ఈ గడువును అందుకోవడానికి తమకు కొన్ని మౌలిక వసతులు, అంతరిక్ష వాహనాలు కావాలని నాసా అధిపతి జిమ్‌ బ్రైడెన్‌స్టైన్‌ తెలిపారు. గ్రీక్‌ పురాణాల్లో చందమామ దేవత అయిన ఆర్టెమిస్‌ పేరును ఈ ప్రాజెక్టుకు ఖరారుచేశారు. ఆర్టెమిస్‌.. అపోలోకు కవల సోదరి. అపోలో పేరిట 1969 నుంచి 1972 మధ్య కాలంలో 12 మంది వ్యోమగాములను నాసా చంద్రుడి మీదకు పంపింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.