close

తాజా వార్తలు

ఆయనెవరో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనకు కావల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందజేసే సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌.. కొన్ని ప్రత్యేక రోజుల్లో దాని డూడుల్‌ను ప్రదర్శిస్తుంది. ఏవైనా పండగలు, ప్రత్యేక రోజులు, ప్రముఖుల జయంతిలు ఇలాంటి సందర్భాల్లో డూడుల్‌ను మారుస్తూ ఉంటోంది గూగుల్‌.  తాజాగా ఈ రోజు ఒడిలో పుస్తకం పట్టుకొని ఉన్న ఒక వ్యక్తి చిత్రాన్ని డూడుల్‌ రూపంలో ఉంచింది. ఆయనెవరో మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయనెవరో ఓ సారి తెలుసుకుందాం.
శనివారం గూగుల్‌ డూడుల్‌లో ఉన్న వ్యక్తి ప్రముఖ పర్శియన్ గణితవేత్త, జ్యోతిషుడు, కవి ఒమర్‌ ఖయ్యమ్‌. ఇతని పూర్తి పేరు అబుల్‌ ఫాత్‌ ఒమర్‌ ఇబ్రహీం అల్‌- ఖయ్యమ్‌. అయితే ఈ రోజు అతని 971వ జయంతి. అతనికి గౌరవసూచికంగా గూగుల్‌ ఈ రోజు ఆయన డూడుల్‌గా పెట్టింది. ఖయ్యమ్‌ జలాలీ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ క్యాలెండరే ఇప్పుడు అనేక క్యాలెండర్‌లకు మూలం . దీంతో పాటు ఆయన గణితంలో పలు అధ్యయనాలు చేశారు. క్యూబిక్‌ సమీకరణాల వర్గీకరణ, సాధన లాంటి అంశాలపై ఆయన అధ్యయనం చేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.