close

తాజా వార్తలు

చిన్నారుల చర్మం... జర భద్రం!

ఎండలు మండిపోతున్నాయి. ఆ వేడి ప్రభావం పిల్లలపై పడితే వాళ్ల చర్మం ఎర్రగా కందిపోవడం, దద్దుర్లు, చెమటకాయలు... ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకుని చూడండి.
వేసవి అయినా సరే... రెండుపూటలా గోరువెచ్చని నీటితోనే వాళ్లకు స్నానం చేయించాలి. చర్మం కమిలిపోయినట్లు కనిపిస్తోంటే... తువాలును చల్లటి నీటిలో ముంచి దాంతో ఆ ప్రాంతాన్ని తుడిచి ఆరాక పౌడరు రాయాలి.
* చిన్నారుల చర్మం ఎండకు కందిపోయినట్లు అయ్యిందా... తాజా కలబంద గుజ్జును ఆ భాగంలో రోజులో రెండుమూడుసార్లు రాస్తే ఉపశమనం కలుగుతుంది.
* ఒక వస్త్రంలో ఐసు ముక్కలను చుట్టి దాంతో కమిలిన చోట మృదువుగా రాయాలి. సమస్య అదుపులోకి వచ్చి హాయిగా అనిపిస్తుంది.
* కమిలిన ప్రాంతంలో నూనె రాయకూడదు. ఇది స్వేద  గ్రంథులు మూసుకుపోయేలా చేస్తుంది.
* గంధం పొడిలో నీళ్లు కలిపి కమిలిన చర్మంపై పూతలా వేయాలి. ఆ ప్రాంతం చల్లగా ఉంటుంది.
* ఈ కాలంలో చిన్నారులు   డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూడాలి. నీళ్లతోపాటు నిమ్మరసం, పండ్లరసాలు, కొబ్బరినీళ్లు ఇవ్వాలి.
* ఎండలో చిన్నారులను బయటకు పంపకూడదు. అలాగే ఉష్ణోగ్రత పెరిగాక వ్యాయామాల్లాంటివి  చేయనివ్వకుండా చూడటం మంచిది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.