
తాజా వార్తలు
బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీదారైన హువావే అగ్రరాజ్యం అమెరికాపై స్వరం పెంచింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో హార్డ్‌వేర్, ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, టెక్నాలజీ సేవలను హువావేకు బదిలీ చేయడం నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫీ గట్టిగానే స్పందించాడు. తమని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించాడు. ‘మా బలాన్ని తక్కువగా అంచనా వేసి అమెరికా రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు’ అని చైనీస్ స్టేట్ మీడియా సీసీటీవీతో అన్నారు.
హువావేపై నిషేధం సడలింపు
మరోపక్క హువావే వ్యాపారం చేయడానికి వీల్లేకుండా విధించిన నిషేధాన్ని 90రోజులు సడలిస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటన వెలువరించింది. ఈ నిర్ణయంతో హువావేకు కాస్త ఊరట లభించింది. అయితే, హువావేతో జాతీయ భద్రతకు ముప్పు ఉందని, ట్రంప్ విధించిన నిషేధంలో ఎలాంటి మార్పు ఉండదని వాణిజ్య విభాగం తెలిసింది. అమెరికా సంస్థలతో వాణిజ్యం కొనసాగించేందుకు హువావేకు తాత్కాలిక లైసెన్స్ మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని టెలికాం ఆపరేటర్లు కీలక సేవల కోసం హువావే పరికరాలు వినియోగిస్తున్నందు వల్ల ఆయా కంపెనీల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించేందుకే నిషేధాన్ని 90రోజులు సడలించినట్లు ప్రభుత్వం వివరించింది. తాత్కాలిక లైసెన్స్ ఇవ్వడం వల్ల హువావే మొబైల్ఫోన్ల వినియోగదారులకు సేవలు కొనసాగడమే కాకుండా గ్రామీణ బ్రాండ్ నెట్వర్క్ తమ సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని అమెరికా తెలిపింది.
మేము ఏకాకులం అయిపోం
దీనిపై హువావే వ్యవస్థాపకుడు రెన్ జెంగ్ఫీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం అమెరికా చర్యల వల్ల హువావే 5జీ నెట్‌వర్క్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. హువేవా స్థాయి టెక్నాలజీని అందుకోవాలంటే ఇతర సంస్థలకు రెండు, మూడేళ్లు పడుతుంది. హువావేపై అమెరికా విధించిన నిషేధాన్ని 90 రోజులు సడలించినా ఆ ప్రభావం ఉంటుందని మేము అనుకోవడం లేదు. అన్నింటికీ మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి చర్యల వల్ల మేము ఏకాకులం అయిపోం. అమెరికా తయారు చేస్తున్న చిప్సెట్లను మేమూ తయారు చేయగలం. అలా అని దాని అర్థం ఆ వస్తువులను మేము కొనుగోలు చేయమని కాదు. ఇతరులతో పోలిస్తే, 5జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో హువావే అందరికన్నా ముందు ఉంది’ అని రెన్ పేర్కొన్నారు.
హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లతో సహా ఇతర ఏ సాంకేతిక సహకారం హువావేకు అందించబోమని గూగుల్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీనివల్ల ఇప్పటికే హువావే మొబైల్స్ వినియోగిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లకు సంబంధించి కొత్త అప్డేట్స్ను కూడా గూగుల్.. హువావే వినియోగదారులు యథావిధిగా అందిస్తుంది. దీనిపై ఇప్పటికే గూగుల్ స్పష్టతనిచ్చింది.
హువావేపై అమెరికా విధించిన నిషేధం సడలించినా, భవిష్యత్‌లో ఆ కంపెనీ తయారు చేసే స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపనుంది. స్మార్ట్ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను హువావే వినియోగించుకోలేదు. దీని కారణంగా చైనా వెలుపల విక్రయాలు జరపాలంటే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే గూగుల్ అందించే సేవలైన గూగుల్ ప్లే, స్టోర్, జీమెయిల్, యూట్యూబ్ వంటి అప్లికేషన్లు హువేవా ఫోన్లలో ఉండవు. ‘హువావే కేవలం ఆండ్రాయిడ్‌కు సంబంధించిన పబ్లిక్ వెర్షన్‌ను మాత్రమే వినియోగించుకోగలదు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన యాప్స్‌ను, సేవలను గూగుల్ నుంచి పొందలేదు’ అని టెక్ వర్గాలు చెబుతున్నాయి. మరి ట్రంప్ సర్కారు తీసుకుంటున్న కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఈ వాణిజ్య యుద్ధం ఎటువైపు మళ్లుతుందో చూడాలి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
