close

తాజా వార్తలు

సీసీ కెమెరాకు చిక్కిన ఉల్కపాతం.. చూడండి 

సిడ్నీ: అది అర్ధరాతి.. ఆ రహదారి నిర్మానుష్యంగా ఉంది. ఇంతలో ఆకాశం ఒక్కసారిగా మెరిసింది.. ఓ అగ్నిగోళం భూమివైపు దూసుకొస్తోంది.  ఇదేదో హరర్‌ సినిమా స్క్రిప్ట్‌ అనుకుంటున్నారు కదూ.. కాదు. నిజంగా జరిగిన సంఘటనే. నమ్మశక్యంకాని ఈ దృశ్యాలు ఆస్ట్రేలియాలోని ఓ సీసీకెమెరాలో నమోదయ్యాయి. 

అస్ట్రేలియాలోని నార్త్‌ టెరిటరీ పోలీసు, ఎమెర్జెన్సీ సర్వీస్‌కు చెందిన సీసీ కెమెరాలు ఈ అద్భుత దృశ్యాలను రికార్డు చేశాయి. ఉత్తర ఆస్ట్రేలియాలోని అలైస్‌ స్పింగ్స్‌, టెన్నంట్‌ క్రీక్‌ ప్రాంతాల మధ్యలో ఆదివారం అర్ధరాత్రి ఆకాశంలో ఓ పెద్ద అగ్నిగోళం దూసుకొస్తున్న  దృశ్యాలు కనిపించాయని  ఓ స్థానిక వ్యక్తి నుంచి పోలీసులకు ఫోన్‌ వచ్చింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. అయితే అది అగ్నిగోళం కాదని..  ఉల్కకు సంబంధించిన దృశ్యాలని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశవంతమైన నీలం కాంతితో ఆకాశం మెరిసిపోయినట్లు అందులో ఉంది. అయితే ఆ ఉల్క ఎక్కడ పడిందో మాత్రం వివరాలు లేవు. ఆకాశంలో ఇలాంటి ఉల్కపాతాలు సహజమని పలువురు అంటున్నారు. గత నెలలో ఇలాంటి దృశ్యాలే ఫ్లోరిడాలో కూడా కనిపించాయి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.