close

తాజా వార్తలు

ఆకాశంలో రాకెట్‌ను ముద్దాడిన మెరుపు..

ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

మాస్కో : రాకెట్‌ ప్రయోగాల సందర్భంగా ఏవైనా అవాంతరాలు ఎదురైతే.. ప్రయోగం విఫలమవడమే కాకుండా, భారీ నష్టం వాటిల్లుతుంది. అందుకే ప్రయోగానికి ముందు కౌంట్‌డౌన్‌తోపాటు శాస్త్రవేత్తలు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అయితే రష్యాకు చెందిన ఓ సోయజ్‌ రాకెట్‌ ప్రయోగం చేపట్టినప్పుడు వాతావరణం సహకరించలేదు. రాకెట్‌ గాల్లోకి దూసుకెళ్లగానే ఆకాశం మెరుపులు, ఉరుములతో దద్దరిల్లింది. ఆ తర్వాత ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఆకాశం వైపు చూశారు.

సోమవారం రష్యా అంతరిక్ష సంస్థ రొస్కోమస్‌..  సోయజ్‌-2 రాకెట్‌ ప్రయోగాన్ని మాస్కోకు 800 కి.మీ దూరంలోని కాస్మోడ్రోమ్‌ ప్రాంతం నుంచి చేపట్టింది. అయితే రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన 10 సెకన్లలోనే ఆకాశంలో వాతావరణం మారిపోయింది. మెరుపులు,ఉరుములు చోటుచేసుకున్నాయి. ఓ భారీ మెరుపు రాకెట్‌ను తాకినట్లు కనిపించింది. ఇలా పలుసార్లు మెరుపులతో ఆకాశం భీతావహంగా మారింది. రాకెట్‌ వెళ్తున్న మార్గానికి సమాంతరంగా మెరుపులు సంభవించాయి. దీంతో ఆ మెరుపు మార్గంలోనే రాకెట్‌ వెళ్లినట్లు ఆకాశంలో కనిపించింది. 

అయితే రాకెట్‌ ప్రయోగానికి మాత్రం ఇవేవి అడ్డంకులు సృష్టించలేదు. రాకెట్‌ ప్రయోగం సాఫీగా సాగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. నిర్దేశిత కక్ష్యలోకి అది విజయవంతంగా చేరిందని తెలిపింది. ‘మెరుపులు మా ప్రయోగానికి ఎలాంటి ఆటంకాలు సృష్టించలేదు. ప్రయోగ బృందానికి అభినందనలు’ అంటూ ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ రొగోజిన్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన అద్భుతమైన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో అంతరిక్ష ప్రేమికులను ఆకట్టుకోవడమే కాకుండా.. సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.