
తాజా వార్తలు
రబాత్ (మొరాకో): కడుపు నింపుకోవడం కోసం ఇతర దేశాలకు వలసలు వెళ్లాలని ప్రయత్నించే వారి బాధలు అన్నీ ఇన్నీ కావు. బతుకు పోరాటంలో వారు ఎన్నో అవమానాలను, బెదిరింపులను, కష్టాలను ఎదుర్కొంటారు. నిబంధనలకు విరుద్ధంగా వలసలు వెళ్లే క్రమంలో పోలీసులకు కనపడకుండా వారు చేసే ప్రయత్నాలు సాహసోపేతంగా ఉంటాయి. ఒక్కోసారి తమ ప్రాణాలను పణంగా పెట్టయినా సరే ఇతర దేశాలకు వెళ్లాలని అనుకుంటారు. ఇటువంటి ఘటలనే ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో సరిహద్దుల్లో ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఒకే రోజులో కొన్ని గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో నలుగురు వ్యక్తులు కారుల్లో ప్రమాదకర స్థితిలో దాక్కుని ప్రయాణించిన తీరు విస్మయం కలిగిస్తోంది.
తమ దేశం నుంచి స్పెయిన్ వెళ్లాలని అనుకున్న ఓ వ్యక్తి ఓ కారు గ్లోవ్ బాక్సులో దాక్కున్నాడు. సరిహద్దుల్లోకి ఆ కారు రాగానే దాన్ని తనిఖీ చేసిన పోలీసులు గ్లోవ్ బాక్సులో ఆ వ్యక్తి ఇరుక్కుని దాక్కోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయనను పట్టుకున్న మూడు గంటలకే మరో కారు వచ్చింది. ఆ కారుని తనిఖీ చేయగా మరో వ్యక్తి కారు ముందు సీటు కింద పడుకుని ఉండడం చూసి అతడిని బయటకు తీశారు.
మరికొన్ని గంటలకే రెండు కార్లలో ఇద్దరు వ్యక్తులు ఆ వాహనాల వెనుక భాగంలో నక్కి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. వారు అందులో ఉన్నప్పుడు, అందులోంచి బయటకు వస్తున్నప్పుడు తీసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వారంతా శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు తెలిపారు. విషవాయువులు ఉండే చోట నక్కి, చాలా సేపు ఉండడంతో వారి నీరసించిపోయారని, ఇద్దరికి ఒంటి నొప్పులు వచ్చాయని చెప్పారు. వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండడంతో మొదట ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించినట్లు వివరించారు. ఇలా పారిపోవాలని చూసిన వారిలో ఓ 15 ఏళ్ల అమ్మాయి కూడా ఉందని తెలిపారు. ఇలా పోలీసులకు చిక్కిన వారంతా 25 ఏళ్లలోపు వారే. మనుషుల అక్రమ రవాణా చేయడానికి కారు డ్రైవర్లు ఇలా సహకరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- పోలీసులపై పూల జల్లు
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఎన్కౌంటర్ను నిర్ధారించిన సజ్జనార్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
