close

తాజా వార్తలు

‘ఈనాడు ఎఫ్‌ఎం’ అరుదైన రికార్డు

హైదరాబాద్: ఎఫ్‌ఎం రంగంలో అడుగుపెట్టిన ఏడాదిలోపే రామోజీ గ్రూపు సంస్థకు చెందిన ‘ఈనాడు ఎఫ్‌ఎం’ అరుదైన రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లకు ఇచ్చే ఇండియన్‌ రేడియో ఫోరమ్(ఐఆర్‌ఎఫ్‌) పురస్కారం ఈఎఫ్‌ఎంను వరించింది. ఆకట్టుకునే కార్యక్రమాలు, వాణిజ్య విలువలు, ప్రతిభకు ప్రోత్సాహం వంటి అంశాలకు సంబంధించిన ఈ అవార్డును ఈఎఫ్‌ఎం దక్కించుకుంది. 

మెట్రోపాలిటన్‌ ప్రజలకు ఎప్పటి నుంచో పరిచయమైన ఎఫ్‌ఎం రేడియో సేవలను... ద్వితీయ శ్రేణి నగరాలకూ అందించే ఉద్దేశంతో గతేడాది జులైలో ఈనాడు ఎఫ్‌ఎం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో... విజయవాడ, వరంగల్‌, రాజమహేంద్రవరం, తిరుపతి ఎఫ్‌ఎం స్టేషన్లు నెలకొల్పింది. పెద్దలు మెచ్చే జానపదాలు, యువతను ఉర్రూతలూగించే పాటలు, కార్యక్రమాలతో శ్రోతలకు చేరువైంది. ఎఫ్‌ఎం స్టేషన్‌ ప్రారంభించి ఏడాది కాకముందే ఐఆర్‌ఎఫ్‌ బెస్ట్‌ న్యూలాంచ్‌ ఎఫ్‌ఎం స్టేషన్‌ సిల్వర్‌ అవార్డును సొంతం చేసుకుని జాతీయస్థాయిలో గుర్తింపు సంపాదించింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రోతలకే అవార్డును అంకితమిస్తున్నామని ఈఎఫ్‌ఎం పేర్కొంది. 

మిగిలిన స్టేషన్లతో పోలిస్తే విభిన్నమైన కార్యక్రమాలు రూపొందిస్తూ ఈఎఫ్‌ఎం శ్రోతలకు దగ్గరైంది. చర్చా వేదికలు, సంగీత అభిమానులకు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సూచనలు, ఆంధ్రా అత్త-తెలంగాణ కోడలు వంటి కార్యక్రమాలు రూపొందించింది. తమ కార్యక్రమాలకు శ్రోతల నుంచి వచ్చే స్పందన సంతృప్తినిస్తోందని ఆర్జేలు చెప్పారు. ఈ పురస్కారం తమ బాధ్యతను పెంచిందని శ్రోతలకు మరింత దగ్గరయ్యేందుకు విభిన్న కార్యక్రమాలు రూపొందిస్తామని ఈఎఫ్‌ఎం పేర్కొంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.