close

తాజా వార్తలు

ఆస్ట్రేలియాలో కాల్పులు.. నలుగురి మృతి

సిడ్నీ: ఉత్తర ఆస్ట్రేలియాలోని డార్విన్‌లో మంగళవారం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. డార్విన్‌లోని ఓ హోటల్‌లోకి తుపాకీతో ప్రవేశించిన ఓ దుండగుడు అందులోని గదుల్లో ఉన్న వారిపై కాల్పులు జరిపి పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు దుండగుడి కోసం గాలించి, అతడిని అరెస్టు చేశారు. ఇది ఉగ్రవాదుల చర్య కాదని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్ ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడింది ఒకే వ్యక్తని పోలీసులు మీడియాకు తెలిపారు.

ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారని, మరో ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసు అధికారి లీ మార్గాన్‌ నిర్ధరించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేసేంత వరకూ ఆ నగరంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 20 సార్లు తుపాకీ మోత వినపడినట్లు స్థానికులు తెలిపారు. ఓ మహిళ కాళ్లపై దుండగుడు పలు రౌండ్ల కాల్పులు జరిపాడని, రక్తపు మడుగులో ఆమె కనపడిందని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. దుండగుడు హోటల్‌లోని ప్రతి గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశాడని అన్నారు.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.