close

తాజా వార్తలు

మూడు భాషల్లో మురిపించారు.. మైమరపించారు!

కొందరు హీరోయిన్లకి ఒక్క సినిమా హిట్టయితే చాలు.. అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి. ఒక కథానాయిక తెలుగులో నటించిన సినిమా మంచి విజయం సాధించిందంటే తమిళం, హిందీ, కన్నడ భాషల దర్శక, నిర్మాతలు తమ ప్రాజెక్ట్‌లలో తీసుకోవాలని భావిస్తుంటారు. ఇటు టాలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ మార్కెట్‌ సంపాదించుకుంటున్న భామలు ఎందరో ఉన్నారు. అలా భాష వచ్చినా రాకపోయినా మూడు భాషల్లో తమ సత్తాను చాటుకుంటున్న ముద్దుగుమ్మలెవరో చూద్దామా..

మిల్కీ బ్యూటీ తమన్నా

2005లో వచ్చిన ‘చాంద్‌ సా రోషన్‌ చెహరా’ అనే హిందీ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు తమన్నా. అదే ఏడాది వచ్చిన ‘శ్రీ’తో తెలుగు ప్రేక్షకుల మనసూ దోచుకున్నారు. తొలి తెలుగు సినిమా ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ తమన్నాకు మాత్రం అటు తెలుగు, తమిళంలో అవకాశాలు బాగానే వచ్చాయి. విరామం లేకుండా ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ అలా.. అలా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. చాలాకాలం తర్వాత ఆమె బాలీవుడ్‌లో అజయ్‌ దేవగణ్‌కు జోడీగా ‘హిమ్మత్‌వాలా’లో నటించారు. అయితే ఆ సినిమా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత ‘హమ్‌ షకల్స్’తో మరోసారి ఉత్తరాదిన తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. అయినా నిరాశే ఎదురైంది. దాంతో తానిక హిందీ సినిమాలు చేయదలచుకోలేదని ఒకానొక సందర్భంలో అన్నారు. కానీ ‘ఖామోషీ’ చిత్రంలో నటించారు. ‘బాహుబలి’తో మూడు భాషల ప్రేక్షకులను అలరించిన మిల్కీ బ్యూటీ, ఇటీవల ‘అభినేత్రి2’తో తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

బాలీవుడ్‌లో ‘యారియా’ సినిమాలో నటిస్తున్నప్పుడే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’లో నటించే అవకాశం దక్కించుకున్నారు రకుల్‌. అయితే కొన్ని కారణాల వల్ల ‘యారియా’ సినిమా ఆలస్యంగా విడుదలైంది. ఈ రెండు సినిమాలు రకుల్‌కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు. దాదాపు ఇండస్ట్రీలోని అగ్రకథానాయకులందరితో నటించారు. ఇటీవల ఆమె అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటించిన ‘దే దే ప్యార్‌ దే’, అటు తమిళంలో సూర్యతో నటించిన ‘ఎన్జీకే’ సినిమాలు విడుదలయ్యాయాయి. ప్రస్తుతం ఆమె ఒక తెలుగు, ఒక తమిళం, ఒక హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు.

రౌడీ బేబీ సాయి పల్లవి

తొలి సినిమాతోనే స్టార్‌డమ్‌ దక్కించుకునే అవకాశం అతి తక్కువ మందికి వస్తుంది. వారిలో సాయి పల్లవి ఒకరు. ‘కస్తూరి మాన్‌’ అనే మలయాళ సినిమాతో నటనను ప్రారంభించిన సాయి పల్లవి ఓ పక్క ఎంబీబీఎస్‌ చదువుతూనే అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఆమె తమిళంలో నటించిన ‘ఎన్జీకే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలో రానాకు జోడీగా ‘విరాటపర్వం’ సినిమాలో నటించనున్నారు.

‘మహానటి’..కీర్తి సురేశ్‌

హానటి సావిత్రి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన నటి కీర్తి సురేశ్‌. ‘పైలట్స్‌’, ‘కుబేరన్‌’ వంటి సినిమాల్లో బాల నటిగా నటించిన కీర్తి.. 2013లో వచ్చిన ‘గీతాంజలి’తో కథానాయికగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తమిళంలో ఆమె తొలి సినిమా ‘ఇదు ఎన్న మాయం’. ఇన్ని సినిమాల్లో నటించినా తెలుగులో చేసిన ‘నేను శైలజ’ చిత్రంతో ఉత్తమ పరిచయ నటిగా ఫిలింఫేర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. ఆ తర్వాత కీర్తికి తెలుగులో వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. ‘మహానటి’ ఆమె కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయింది. ఈ ఏడాది బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టేశారు. అజయ్‌ దేవగణ్‌కు జోడీగా క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.

తాప్సి

తెలుగులో 2010లో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తాప్సి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అదే ఏడాది ‘ఆడుకలం’ అనే తమిళ సినిమాలోనూ నటించారు. తెలుగు, తమిళం కంటే తాప్సి ఎక్కువగా హిందీ చిత్రాల్లోనే నటించారు. వైవిధ్య కథలను, పాత్రలను ఎంచుకుంటారన్న పేరును సంపాదించుకున్నారు. చాలా కాలం తర్వాత ఆమె తమిళంలో నటించిన ‘గేమ్‌ ఓవర్‌’ సినిమా తెలుగు, హిందీలో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వనపర్తి భామ అదితి రావు హైదరి

మెను చూస్తే ఎవ్వరూ తెలుగమ్మాయి అనుకోరు. కానీ, ఆమెది వనవర్తి రాజుల కుటుంబం. అదితి పుట్టింది హైదరాబాద్‌లోనే. మలయాళం పరిశ్రమ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళంలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అదితి తమిళంలో ‘సైకో’, తెలుగులో ‘వీ’ సినిమాల్లో నటిస్తున్నారు.

శ్రుతి హాసన్‌

మల్‌హాసన్‌ కుమార్తెగా శ్రుతిహాసన్‌ నేరుగా తెలుగు  లేదా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడతారని అందరూ అనుకున్నారు. కానీ ఆమె బాలీవుడ్‌లో ‘లక్’ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా శ్రుతికి అంత లక్‌ను తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత ‘ఉన్నైపోల్‌ ఒరువన్‌’ అనే తమిళ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. 2012లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’లో నటించినా  శ్రుతికి బ్రేక్‌ ఇచ్చిన సినిమా మాత్రం ‘గబ్బర్‌సింగ్‌’. అయితే ఆమె మధ్యలో మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను రూపొందించడంలోనూ బిజీగా ఉండేవారు. చాలా కాలం తర్వాత ఆమె తమిళంలో, హిందీలో ఓ సినిమాకు సంతకం చేశారు.

కాజల్‌ అగర్వాల్‌

‘క్యూ.. హో గయానా’ అనే హిందీ చిత్రంలో సినీ కెరీర్‌ను ప్రారంభించిన కాజల్‌.. ‘లక్ష్మీ కల్యాణం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా తెలుగు, తమిళంలో సినిమాలతో బిజీ అయిపోయారు. మధ్యలో రెండు, మూడు హిందీ సినిమాల్లోనూ నటించారు. అయితే ఆమె చివరిగా బాలీవుడ్‌లో నటించిన సినిమా ‘దో లఫ్జోంకీ కహానీ’. ఈ సినిమా హిట్‌ అవ్వలేదు. దీంతో ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నారు. 

అక్కినేని కోడలు..

మంత కేవలం తెలుగు, తమిళ చిత్రాల్లోనే నటించారనుకుంటే పొరపాటే. ఆమె బాలీవుడ్‌లోనూ నటించారు. అయితే ఆమె నటించింది కేవలం ఒక్క సినిమాలోనే. అందులోనూ తన పాత్రలో తానే నటించారు. ‘ఏ మాయ చేశావె’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసుతో పాటు నాగచైతన్య హృదయాన్ని కూడా కొల్లగొట్టారు. ఈ సినిమాను హిందీలో ‘ఏక్‌ దివానా థా’ అనే టైటిల్‌తో రీమేక్‌ చేశారు. ఇందులో సమంత అతిథి పాత్రలో మెరిశారు. ఆ తర్వాత ఆమె కేవలం తెలుగు, తమిళ సినిమాలతో బిజీ అయిపోయారు. అయితే తనకు దక్షిణాది అభిమానుల నుంచి ఇంత ఆదరణ లభిస్తున్నప్పుడు బాలీవుడ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని సమంత ఒకానొక సందర్భంలో అభిప్రాయపడ్డారు. 

ఎవర్‌గ్రీన్‌ త్రిష

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ఎవర్‌గ్రీన్‌ నటి త్రిష. తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన త్రిష.. అందివచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఆమె ఎక్కువగా తెలుగు, తమిళం సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. ఇప్పుడు ఆమె దృష్టంతా తమిళ సినిమాలపైనే ఉంది. ‘96’, ‘పేట’ చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌ విజయాలు అందుకున్న త్రిష ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

వీరే కాదు శ్రియ, విద్యా బాలన్‌, కూడా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.