close

తాజా వార్తలు

గూగుల్‌ క్రోమ్‌లో సరిగమప!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌...ఈ పదం చాలా మంది జీవితాల్లో ఓ భాగమైపోయింది. యువతకైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు వీలు చిక్కినప్పుడల్లా దీని సాయంతో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్‌లో ఇంటర్నెట్‌ వినియోగించే వారిసంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014లో మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదారులు 26 శాతం మంది ఉంటే.. 2019 నాటికి అది 48 శాతానికి చేరుకుంది. మరోవైపు డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లెట్‌లో ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేసేవారి సంఖ్య కూడా వృద్ధి చెందుతోంది. ఏ చిన్న అంశాన్నైనా గూగుల్లో శోధించడం అలవాటుగా మారిపోతోంది. ప్రపంచంలోని మొత్తం బ్రౌజర్లను పరిగణలోకి తీసుకుంటే అత్యధికంగా 70 శాతం మార్కెట్‌షేర్‌తో గూగుల్‌ క్రోమ్‌ ప్రథమ స్థానంలో ఉంది. ఫైర్‌ ఫాక్స్‌ 9.78 శాతం మార్కెట్‌ను సంపాదించింది.ఈ నేపథ్యం చిన్న పాటి షార్ట్‌కట్స్‌ను పాటిస్తే గూగుల్‌ క్రోమ్‌లో బ్రౌజింగ్‌ను మరింత మరింత చక్కగా ఆస్వాదించవచ్చు. అవేంటో చూసేద్దామా..?

 

ప్రైవేట్‌ బ్రౌజింగ్‌ కోసం..


 

షేర్డ్‌ నెట్‌వర్క్‌లో ఉన్న కంప్యూటర్లో పని చేస్తున్నప్పుడు అందులో ఏమేం ఓపెన్‌ చేస్తున్నామో, ఐపీ అడ్రస్‌ ద్వారా మరో వ్యక్తి తెలుసుకునే అవకాశం ఉంది. ఒకే కంప్యూటర్‌ను ముగ్గురు నలుగురు వాడినట్లయితే.. వారందరి బ్రౌజింగ్‌ హిస్టరీ, కుకీస్‌ అన్నీ సేవ్‌ అవుతాయి. అలా కాకుండా మన బ్రౌజింగ్‌ సమాచారం అవతలి వ్యక్తికి తెలియకుండా ప్రైవేట్‌ బ్రౌజింగ్‌ చేసుకునే సదుపాయముంది. దీని కోసం క్రోమ్‌ను ‘ గో ఇన్‌కాగ్నిటో’ మోడ్‌లో ఓపెన్‌ చేయాలి. విండోస్‌ ఓఎస్‌ అయితే..Ctrl+Shift+N, యాపిల్‌ ఓఎస్‌లో Apple Key +Shift+N  ప్రెస్‌ చేయాలి.

అప్పుడే ఒక ట్యాబ్‌ క్లోజ్‌ చేస్తే..

 బ్రౌజింగ్‌ సమయంలో మనం చాలా ట్యాబ్‌లు ఓపెన్‌ చేస్తుంటాం. కొన్ని సార్లు అనుకోకుండా ఓ ట్యాబ్‌ క్లోజ్‌ అయిందనుకోండి.. వెంటనే దానిని తిరిగి ఓపెన్‌ చేయాలంటే.. విండోస్‌ కీ బోర్డుపై Ctrl+Shift+T
యాపిల్‌ కీ బోర్డుపై Apple Key+ Shift+T ఉపయోగించాలి. ఆ సెషన్‌లో క్రోమ్‌ బ్రౌజర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత మొదట ఏ ట్యాబ్‌ క్లోజ్‌ చేశామో దానిని తిరిగి పొందేవరకు చేయొచ్చు.

యాక్టివ్‌ ట్యాబ్‌ను క్లోజ్‌ చేయాలంటే..

బ్రౌజింగ్‌ చేస్తున్న సమయంలో యాక్టివ్‌ ట్యాబ్‌ను క్లోజ్‌ చేయాలంటే ప్రతిసారీ ‘×’ గుర్తుపై క్లిక్‌ చేయాల్సిన అవసరం లేదు.  విండోస్‌ కీ బోర్డులో అయితే Ctrl+w, యాపిల్‌ కీ బోర్డుపై  Apple Key+w ఒత్తితే సరిపోతుంది. మరళా అదే ట్యాబ్‌ను ఓపెన్‌ చేయాలంటే పైన చెప్పిన విధంగా Ctrl+Shift+T ప్రెస్‌ చేస్తే సరిపోతుంది.

 ట్యాబ్స్‌ జంపింగ్‌ కోసం..

బ్రౌజింగ్‌ చేస్తున్నప్పుడు  మీరో 10 ట్యాబ్‌లు ఓపెన్‌ చేశారనుకుందాం. అందులో ఒక ట్యాబ్‌ను సెలెక్ట్‌ చేసుకోవడానికి ప్రతిసారి మౌస్‌తో అక్కడ క్లిక్‌ చేయాలంటే విసుగనిపిస్తుంది. దీనికోసం అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విండోస్‌లో అయితే.. Ctrl+ page Down ( తర్వాతి ట్యాబ్‌ కోసం), Ctrl+ Page Up (మునుపటి ట్యాబ్‌ కోసం) క్లిక్‌ చేస్తే సరిపోతుంది. అదే యాపిల్‌లో  అయితే  యాక్టివ్‌ ట్యాబ్‌ తర్వాత ఉన్న ట్యాబ్‌ కోసం Apple Key+ Option+ Right arrow, మునుపటి ట్యాబ్‌ కోసం  Apple Key+Option+ Left Arrow ప్రెస్‌ చేయాలి.

విండోను మినిమైజ్‌ చేసేందుకు..

అవసరం మేరకు బ్రౌజర్‌లో రెండు ట్యాబ్‌లకు బదులుగా రెండు విండోస్‌ను ఓపెన్‌ చేశారు అనుకుందాం. అందులో ఒక దానిని మినిమైజ్‌ చేయడానికి ‘-’ బటన్‌పై క్లిక్‌ చేయాల్సిన అవసరం లేదు. 
విండోస్‌ ఓఎస్‌ అయితే  Window Key+M, యాపిల్‌ ఓఎస్‌ అయితే.. Apple Key+M ఒత్తితే సరిపోతుంది.

 డౌన్‌లోడ్‌ పేజ్‌ కోసం..

బ్రౌజ్‌  చేసేటప్పుడు అవసరం కొద్దీ కొన్ని ఫైల్స్‌ డౌన్‌లోడ్‌ చేస్తుంటాం. ఆ ఫైల్స్‌ ఎక్కడున్నాయో ఓపెన్‌ చేసేందుకు విండోస్‌లో అయితే Ctrl+J, యాపిల్‌లో అయితే.. Apple Key+OPtion+L ప్రెస్‌ చేస్తే సంబంధిత డౌన్‌లోడ్‌ పేజీ తెరచుకుంటుంది.

బుక్‌మార్క్‌ మేనేజర్‌.

 

ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ చేస్తున్న సమయంలో మనకు కావాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని బుక్‌మార్స్ రూపంలో సేవ్‌ చేసుకునే అవకాశముంది. దీనికి సంబంధించిన బుక్‌మార్క్‌ మేనేజర్‌ను ఓపెన్‌ చేసేందుకు విండోస్‌లో అయితే ctrl+D,యాపిల్‌ ఓఎస్‌లో Apple+Option+D ప్రెస్‌ చేయాలి.

నేరుగా సెర్చ్‌బార్‌లోకి వెళ్లాలంటే..

 యాక్టివ్‌ ట్యాబ్‌లోని సెర్చ్‌బార్‌లో ఏదైనా టైప్‌ చేయాల్సి వచ్చినప్పుడు.. అక్కడ మౌస్‌తో క్లిక్‌ చేయాల్సిన అవసరం లేదు. విండోస్‌ కీ బోర్డుపై Ctrl+L,  అదే యాపిల్‌ కీ బోర్డులో అయితే Apple key+l ప్రెస్‌ చేస్తే సరిపోతుంది.

బ్రౌజింగ్‌ డేటాను తొలగించేందుకు

ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేసే సమయంలో ఎన్నో వెబ్‌సైట్స్‌ను ఓపెన్‌ చేస్తుంటాం. ఆ డేటా అంతా బ్రౌజింగ్‌ హిస్టరీలో నిక్షిప్తమవుతుంది. ఎదుటి వారికి మనం ఏమేం బ్రౌజ్‌ చేశామో తెలియకూడదనుకుంటే బ్రౌజింగ్‌ పూర్తయిన వెంటనే హిస్టరీని క్లియర్‌ చేయాలి. దీని కోసం  విండోస్‌లో Ctrl+Shift+ Delete, యాపిల్‌ కీబోర్డులో Apple+Shift+Delete ప్రెస్‌ చేయాలి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.