
తాజా వార్తలు
గూగుల్ మ్యాప్స్ ఉందిగా!
ఇంటర్నెట్‌డెస్క్: గూగుల్ మ్యాప్స్ వినియోగించే వారికి శుభవార్త. భారతీయ వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ మూడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా భోజన ప్రియులకు రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుతుందో మరింత సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఆఫర్లను కూడా పొందవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 11 నగరాల్లో గూగుల్ మ్యాప్స్ ఈ సౌలభ్యాన్ని తెచ్చింది. గూగుల్ మ్యాప్స్ వినియోగదారులు తమ ఇష్టమైన భోజనాన్ని సమీపంలో ఉన్న రెస్టారెంట్లలో ఆఫర్లతో పాటు పొందవచ్చు. దిల్లీ, ముంబయి. బెంగళూరు, పుణె, చెన్నై, కోల్‌కతా, గోవా, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
ఇందుకోసం గూగుల్ మ్యాప్స్ ఈజీ డిన్నర్‌తో చేతులు కలిపింది. దాదాపు 4వేలకు పైగా రెస్టారెంట్లలో ఆఫర్లను అందుకోవచ్చు. మరిన్ని కేటగిరీలతో పాటు, ఇతర ఫుడ్ యాప్‌లతో కూడా భాగస్వామ్యంపై చర్చలు జరుపుతున్నట్లు గూగుల్ తెలిపింది. ఇందుకోసం వినియోగదారులు గూగుల్ మ్యాప్స్‌కు వెళ్లి ఎక్స్‌ప్లోరర్‌పై క్లిక్ చేసి ఆఫర్స్ తెలుసుకోవచ్చు. అంతేకాదు, 15 రోజుల పాటు ఈజీడిన్నర్ ప్రైమ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా కనీసం 25శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
దీంతో పాటు, గూగుల్ మ్యాప్స్‌ను రీడిజైన్ చేసింది. భారత్‌కు అనుగుణంగా ‘ఎక్స్ప్లోర్’, అనుభవాలను పంచుకునేందుకు ‘ఫర్ యు’ను తెచ్చింది. ‘గూగుల్ మ్యాప్స్ వినియోగిస్తున్న వారు విజువల్ పరంగా అద్భుతమైన అనుభూతిని కోరుకుంటున్నారు. అందుకే మ్యాప్స్‌ను రీడిజైన్ చేశాం. దీంతో పాటు, ‘ఫర్ యు ఫీచర్’, ‘డైనింగ్ ఆఫర్స్’ తెచ్చాం’ అని గూగుల్ మ్యాప్స్ డైరెక్టర్ క్రిష్ విఠల్దేవర తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
