close

తాజా వార్తలు

ఉగ్ర గోదారి..జలదిగ్బంధంలో 400 గ్రామాలు

రాజమహేంద్రవరం: అంతకంతకూ పెరుగుతున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం, పోచమ్మగండి, పోడిపల్లి, తొయ్యారు, పోలవరం మండలాల్లోని 400 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీకి ప్రస్తుతం 9.34 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా...9.27 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఆనకట్ట వద్ద ప్రస్తుతం 11.2 అడుగుల మేర ఉన్న నీటిమట్టం ఉండటంతో సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

వశిష్ఠ, వైనతేయ, గౌతమి పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 26కు పైగా ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. పి.గన్నవరం మండలం చాలకలి పాలెం సమీపంలో కాజ్‌వే నీట మునిగింది. నాలుగు రోజులుగా కరకాయ లంక ప్రజలు అవస్థలు పడుతున్నారు. బూరుగు లంక, హరిగెలవారిపేట, జి.పెదపూడి లంక, అయోధ్య లంక, అనగారిలంక వాసులు మరబోట్లపై రాకపోకలు సాగిస్తున్నారు. గండిపోచమ్మ అమ్మవారి విగ్రహం వద్ద 2 అడుగుల మేర వరద నీరు నిలిచింది. దీంతో హుండీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా ప్రాంతాల్లో అరటితోటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం, తొయ్యారు రహదారిపై 4 అడుగుల మేర ప్రవాహ ఉద్ధృతి నెలకొంది. లంకగ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలోనూ గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మునిగిపోయింది. స్పిల్‌వే మీదుగా 2 మీటర్ల మేర నీరు ప్రవహిస్తోంది. కాఫర్‌ డ్యాం వద్ద వరద ప్రవాహం 28 మీటర్లకు చేరుకుంది. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు వారం రోజులుగా రాకపోకలు స్తంభించాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగుకు వరద చేరడంతో 14 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.