
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: బాలీవుడ్ నటి సన్నీలియోని ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. దిల్జిత్ దొసాంజే, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ పాటియాలా’. రోహిత్ జగ్రాజ్ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో సన్నీ ఓ పాటలో ఆడిపాడారు. ఈ సందర్భంగా అనుకోకుండా దిల్లీకి చెందని ఓ వ్యక్తి ఫోన్ నంబర్‌ను తన నెంబర్‌గా అందులో చెప్పారు. దీంతో రోజూ అతనికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కొన్ని వందల ఫోన్లు వస్తుండటంతో సదరు వ్యక్తికి సన్నీ క్షమాపణ చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై మాట్లాడుతూ. ‘క్షమించండి. మీకు అలా జరిగినందుకు సారీ చెబుతున్నా. మీకు చాలా మంది వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చి ఉంటాయి’ అని అన్నారు.
సన్నీ వెల్లడించిన ఆ నంబర్ దిల్లీకి చెందిన 27 ఏళ్ల పునీత్ రాజ్‌పుత్‌ది. ‘అర్జున్ పాటియాల’ విడుదలైన నాటి నుంచి పునీత్‌కు కొన్ని వందల ఫోన్‌కాల్స్ వస్తున్నాయట. దీంతో విసిగిపోయిన అతడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చాలా మంది సన్నీలియోని అనుకుని తనకు ఫోన్లు చేస్తున్నారని, అసభ్య సందేశాలు పంపిస్తున్నారని పునీత్ పోలీసుల ఎదుట వాపోయాడు.
‘‘అర్జున్ పాటియాలా’ విడుదలైన నాటి నుంచి నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ చేసిన వాళ్లందరూ సన్నీ లియోనితో మాట్లాడాలని అడుగుతున్నారు. నన్ను ఆట పట్టించేందుకు ఇలా చేస్తున్నారని మొదట అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆ చిత్ర బృందం సన్నీలియోని పాత్ర కోసం నా ఫోన్ నంబర్ వాడారని తెలిసింది. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు. అసభ్య మాటలు మాట్లాడుతున్నారు. తమకు ఫేవర్ చేయాలని, డబ్బులు ఇస్తామంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దీంతో నాకు విసుగు వచ్చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశా. అయితే, వారి నుంచి కూడా ఎలాంటి హామీ లభించలేదు’’ అని పునీత్ రాజ్‌పుత్ తన గోడును వెళ్లబోసుకున్నాడు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- బాపట్లలో వింత శిశువు జననం
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
