close

తాజా వార్తలు

క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు

వినూత్న ఆలోచనతో క్రికెట్‌ ఆస్ట్రేలియా 

సిడ్నీ: క్రికెట్‌ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచనతో ముందడుగు వేసింది. ట్రాన్స్‌జెండర్లకు సైతం క్రికెట్‌లో అవకాశమివ్వాలని నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని తెలుపుతూ క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. #ASportForAll అనే హ్యాష్‌టాగ్‌ను జతచేసింది. క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు, లింగభేదం లేని ఆట అనే నినాదాలతో ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టింది. 

కాగా ఈ వినూత్న నిర్ణయంపై క్రికెట్‌ అభిమానులు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోమని క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరగా.. అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ నిర్ణయం పట్ల అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది వేచిచూడాలి. 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.