Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142517
            [news_title_telugu_html] => 

కావొద్దు.. స్టీరాంగ్‌!

[news_title_telugu] => కావొద్దు.. స్టీరాంగ్‌! [news_title_english] => [news_short_description] => కారుని మలుపు తిప్పాలంటే స్టీరింగ్‌ సరిగా ఉండాలి... జీవితం చెడు మలుపు తిరగొద్దంటే పట్టుకునే స్టీరింగ్‌ పొజిషన్‌ బాగుండాలి... ఏ సమయంలో ఎలాంటి పొజిషన్‌ తీసుకోవాలి? ఏ ప్రయాణానికి ఎలాంటి భంగిమ ఎంచుకోవాలి? స్టీరింగ్‌ లోపాలతో కలిగే అనర్థాలేంటి? తలెత్తే అనారోగ్య సమస్యలకు ఎలా చెక్‌ పెట్టాలి?ఈ సందేహాలన్నీ నిపుణుల ముందుంచాం. [news_tags_keywords] => steering, car, wheel, automobile, rai rai, eenadu special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-16 01:05:42 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కావొద్దు.. స్టీరాంగ్‌! - EENADU
close

తాజా వార్తలు

కావొద్దు.. స్టీరాంగ్‌!

కారుని మలుపు తిప్పాలంటే స్టీరింగ్‌ సరిగా ఉండాలి... జీవితం చెడు మలుపు తిరగొద్దంటే పట్టుకునే స్టీరింగ్‌ పొజిషన్‌ బాగుండాలి... ఏ సమయంలో ఎలాంటి పొజిషన్‌ తీసుకోవాలి? ఏ ప్రయాణానికి ఎలాంటి భంగిమ ఎంచుకోవాలి? స్టీరింగ్‌ లోపాలతో కలిగే అనర్థాలేంటి? తలెత్తే అనారోగ్య సమస్యలకు ఎలా చెక్‌ పెట్టాలి?ఈ సందేహాలన్నీ నిపుణుల ముందుంచాం. వారిచ్చిన సలహాలు ఆచరిస్తూ మన వాహన చక్రాలను గమ్యం వైపు సాఫీగా సాగిపోనిద్దాం.
చేతిలో స్టీరింగ్‌.. ఒంట్లో ఉత్సాహం ఉంటే హ్యాచ్‌బాక్‌ నుంచి హై-ఎండ్‌ కారు ఏదైనా అరవై మైళ్ల వేగంతో దూసుకెళ్లిపోవచ్చు. కానీ స్టీరింగ్‌ తిప్పడంలో ఏమాత్రం తేడాలొచ్చినా జీవితం తలకిందులవుతుంది.
నిజానికి స్టీరింగ్‌ చక్రం ఇలాగే పట్టుకోవాలనే కచ్చితమైన నిబంధనేం లేదు. సౌకర్యం, డ్రైవింగ్‌ చేసే అలవాటు ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు మూడు పొజిషన్లు ఎంచుకుంటారని తేలింది. స్టీరింగ్‌ చక్రాన్ని గోడ గడియారంలా భావిస్తే పైన 12, కింద 6, ఎడమ వైపు 9, కుడి చేయి 3 అవుతుంది. ఎక్కువమంది 9-3, 8-4, 10-2 భంగిమలు ఎంచుకుంటున్నారు. వీటిని సమర్థంగా, ఏ సమయాల్లో ఎంచుకోవాలో తెలుసుకుందాం.
ఇవీ పాటించాలి
* ఒకే చేత్తో స్టీరింగ్‌ పట్టుకోవద్దు. కారు వేగంలో ఉన్నప్పుడు నియంత్రించడం చాలా కష్టం.
* కొందరు స్టీరింగ్‌ పట్టుకొని బొటనవేళ్లని పైకి ఆడిస్తుంటారు. అకస్మాత్తుగా రోడ్డుపై ఏదైనా అడ్డొస్తే నియంత్రించలేం.
* ఎక్కువ మలుపులు, యూటర్న్‌లు తీసుకుంటున్నప్పుడు ఒక చేయి పైన ఉంటే, ఇంకోటి కింద.. ఉండే పొజిషన్‌లో ఎంచుకోవాలి. ఒంటి చేత్తో స్టీరింగ్‌ తిప్పే ప్రయత్నం చేయొద్దు.
* పెద్దపెద్ద మలుపులు, యూటర్న్‌లు తీసుకున్న వెంటనే 9-3 పొజిషన్‌కి రావాలి.
* స్టీరింగ్‌ వీల్‌ రిమ్‌ కింద చేతులు పెట్టొద్దు. ఇలా చేస్తే వాహనం అదుపులో ఉండకపోవడమే కాదు.. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నప్పుడు చేతులకు తీవ్ర గాయాలపాలవుతాయి.
* లోపల కూర్చునేముందే సీటుని అడ్జెస్ట్‌ చేసుకోవాలి. విండ్‌షీల్డ్‌ అద్దాల నుంచి చూస్తే కారు, రోడ్డు మధ్య మీటరు దూరమైనా స్పష్టంగా కనిపించగలగాలి.
* అరచేతులు పైకి కనిపించేలా స్టీరింగ్‌ వీల్‌ లోపల చేతులు పెట్టి హుకింగ్‌ చేస్తుంటారు కొందరు ఇది ప్రమాదకరం.
* స్టీరింగ్‌, సీటుకి మధ్య పది అంగుళాల దూరమైనా ఉండాలి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌ అత్యంత వేగంతో విచ్చుకున్నప్పుడు ఛాతిపై విపరీతమైన ఒత్తిడి పడి ఒక్కోసారి మరణమూ సంభవించవచ్చు.
* 7, 5 పొజిషన్‌లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా స్టీరింగ్‌ తిప్పడం సాధ్యం కాదు. దీన్ని ఆచరించడం తగదు.
* గేర్‌ నాబ్‌, ఇతర కంట్రోల్‌ బటన్లు నొక్కాల్సి వచ్చినప్పుడు వాహనం వేగం కాస్త తగ్గించాలి. ఒక చేత్తో మంచి గ్రిప్‌ ఉండేలా స్టీరింగ్‌ పట్టుకోవాలి.
* స్టీరింగ్‌ ఒంటి చేత్తోనే పట్టుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా 9, 3 పొజిషన్‌లో ఉంచాలి.

ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు 10-2

ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు, రోడ్డుమీద అవాంతరాలు ఎక్కువైనప్పుడు ఈ పొజిషన్‌ ఎంచుకుంటే మేలు. చక్రాన్ని ఎక్కువసార్లు అటూఇటూ తిప్పడానికి అనువుగా ఉంటుంది. చిన్నకార్లలో క్యాబిన్‌ ఇరుకుగా ఉంటుంది. వేరే పొజిషన్లు ఎంచుకుంటే మోచేతులు డోర్లకి, అద్దాలకి తగిలే అవకాశం ఉంటుంది. అందుకే హ్యాచ్‌బాక్‌ డ్రైవింగ్‌కి ఈ భంగిమ అనుకూలం. ఎత్తు, పొడవు చేతులున్న వారికి సైతం ఇదే నప్పుతుంది. ఎయిర్‌బ్యాగ్‌లున్న కారులో మాత్రం ఈ స్థితి ఎంచుకోవద్దని చెబుతారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకుంటే ఛాతి, చేతులు, ముఖంపై తీవ్రమైన ఒత్తిడి పడి గాయాలపాలవుతారు.

అందరి ఎంపిక 9-3

కారు డ్రైవింగ్‌ శిక్షకులు, ఆటోమొబైల్‌ నిపుణుల్లో అత్యధికుల ఓటు దీనికే. దీన్ని సహజసిద్ధమైన, సౌకర్యవంతమైన పొజిషన్‌గా భావిస్తారు. సెడాన్‌, ఎస్‌యూవీ, లగ్జర్లీ కార్ల స్టీరింగ్‌ చక్రం డయామీటర్‌ (చుట్టుకొలత) సహజంగానే చిన్నగా ఉండటంతో ఈ పొజిషన్‌ అనుకూలంగా ఉంటుంది. స్టీరింగ్‌ వీల్‌లో ఉండే కంట్రోల్‌ మీటలను మణికట్టు సాయంతో తేలికగా నియంత్రించవచ్చు. ఈ భంగిమలో రెండు చేతుల మధ్య దూరం సమానంగా ఉండటంతో బ్యాలెన్స్‌డ్‌గానూ ఉంటుంది. తక్కువ దూరాల నుంచి లాంగ్‌టూర్లకు వెళ్లే డ్రైవర్లు దీన్ని ఎంచుకోవచ్చు.

దూరప్రయాణాలకు 8-4

జాతీయ రహదారుల్లో, అత్యధిక దూరం ప్రయాణిస్తున్నప్పుడు సాధారణంగా స్టీరింగ్‌ని ఎక్కువగా అటూఇటూ తిప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి సందర్భాల్లో ఈ పొజిషన్‌ ఎంచుకుంటే మేలు అంటారు నిపుణులు. అప్పుడు మోచేయి, భుజం 90 డిగ్రీల కోణంలో ఉండాలి. ఇది కాకుండా వేరే భంగిమ ఎంచుకొని గంటలకొద్దీ ప్రయాణం చేస్తే భుజాలు, మెడ కండరాల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది. అలసట, ఒంట్లో సత్తువ తగ్గి స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఐఐటీ-మద్రాసు నిపుణులు తరచూ దూరప్రయాణాలు చేసే కొంతమందిపై సర్వే చేయగా 8-4 కాకుండా ఇతర భంగిమలు ఎంచుకున్నవారు వెన్నునొప్పి సమస్యలు, కండరాల సమస్యల బారిన పడ్డట్టు గుర్తించారు.

అతి అత్మవిశ్వాసం వద్దు

మనం నడిపే కారు, ప్రయాణించే సందర్భానికి అనుగుణంగా స్టీరింగ్‌ పట్టుకునే విధానం మార్చుతుండాలి. డ్రైవింగ్‌ నేర్చుకునే వాళ్లకి మేం ఎక్కువగా 9-3 పొజిషన్‌ ఎంచుకొమ్మని చెబుతాం. అతి ఆత్మవిశ్వాసంతో కొందరు స్టీరింగ్‌ కింద, పైన, పక్కలా పట్టుకుంటారు. ఒక్క చేతినే ఉపయోగిస్తారు. ఈ నిర్లక్ష్యం ఒక్కోసారి పెను ప్రమాదాలకు దారి తీస్తుంది. హైవేలపై వెళ్తున్నప్పుడు స్టీరింగ్‌ని కుదురుగా పట్టుకొని ఉంచినా ఎటైనా ఒక పక్కకే లాగేస్తుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా ఎడమ, కుడిలకు టర్న్‌ చేస్తుండాలి. స్టీరింగ్‌పై పూర్తి పట్టు లేనివాళ్లు తక్కువ వేగంతో వెళ్లడమే మంచి పరిష్కారం.
- దుర్గాకుమారి, హ్యుందాయ్‌ మోటార్స్‌ డ్రైవింగ్‌ స్కూల్‌

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.