close

తాజా వార్తలు

రైల్వే స్టేషన్‌లో ఎంతో మందిని ప్రేమించా

షారుక్‌ ఖాన్‌

ముంబయి: తనకు రైల్వే స్టేషన్లతో ఎంతో అనుబంధం ఉందని అంటున్నారు బాలీవుడ్‌ కింగ్ షారుక్‌ ఖాన్‌. ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో షారుక్‌ కొత్త పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బాంద్రా రైల్వే స్టేషన్‌కు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను రైల్వే స్టేషన్లలోనే ఎంతో మంది అమ్మాయిలను ప్రేమించాను (సినిమాల్లో). ముంబయిలోని అన్ని రైల్వే స్టేషన్లను చూశాను కానీ బాంద్రా చూడలేదు. ఈరోజు ఆ లోటూ తీరిపోయింది. ఇప్పుడు నేను బాంద్రా స్టేషన్‌ చూశాను కాబట్టి మున్ముందు నేను నటించబోయే సినిమాల్లోని హీరోయిన్లను ఇక్కడి తరచూ తీసుకొస్తూ ఉంటాను’ అని చమత్కరించారు. 

షారుక్‌ నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలోని రైలు సన్నివేశం ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఆ తర్వాత వచ్చిన ‘దిల్‌ సే’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ సినిమాల్లోనూ ఫేమస్‌ రైలు సన్నివేశాలు ఉన్నాయి.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.