close

తాజా వార్తలు

కొండపై ఖగోళ వింతలు

దేశంలోనే తొలి ‘స్పేస్‌ సైన్స్‌ మ్యూజియం’

‘‘భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల అతి పెద్ద అంతరిక్ష ప్రయోగం చేసిందట.. జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 రాకెట్‌లో చంద్రుడిపైకి ‘చంద్రయాన్‌-2’ ఉపగ్రహాన్ని, ఫలానా శాటిలైట్‌ను తీసుకెళ్లిందట.. అది విజయవంతమై, నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది’’.. ఇలాంటి విషయాలు సామాన్య ప్రజలకు ఆసక్తికరమైన అంశాలు.

నారాయణగూడ: ఉపగ్రహ ప్రయోగాలను, పరికరాలను దగ్గరగా చూడటం అందరికీ సాధ్యం కాదు. వీక్షించాలనుకుంటే శ్రీహరికోటకు వెళ్లాల్సిందే. అక్కడ అవకాశం లభిస్తుందో లేదో తెలియదు. అందుకే ఇస్రో సహకారంతో ఆదర్శనగర్‌లోని నౌబత్‌ పహాడ్‌పై ఉన్న బిర్లా అర్కియాలజీ అండ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌)లోని మూడో అంతస్తులో ‘స్పేస్‌ సైన్స్‌ మ్యూజియం’ ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే మొట్టమొదటిది కావడం విశేషం. ఇక్కడుంటే అంతరిక్ష కేంద్రంలో ఉన్నామనే అనుభూతి కలుగుతుంది. బిర్లా ఆర్కియాలజీ అండ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బీఏసీఆర్‌ఐ) స్వర్ణోత్సవాల సందర్భంగా జులై 26న అందుబాటులోకి వచ్చింది. బిర్లా కుటుంబీకులు నిర్మలా బిర్లా, సి.కె.బిర్లాల సమక్షంలో గవర్నర్‌ నరసింహన్‌ దీనిని ప్రారంభించారు.

 

శాస్త్ర విజ్ఞాన విశేషాల నిధి
ఇక్కడ సాధారణ పౌరులకు తెలియని అనేక విషయాలపై అవగాహన పెంచుకునే అవకాశం ఉందంటున్నారు బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ. ‘1950లో తొలి అంతరిక్ష పరిశోధన జరిగిన సందర్భం మొదలుకొని, నేటి వరకు చేసిన పలు ప్రయోగాల గురించి తెలుసుకోవచ్చు. ఆయా ఉపగ్రహాల విధులు, ఖగోళం నుంచి అవి మనకు చేరవేసే సమాచారం  గురించి చెప్పడానికి వాలంటీర్లు ఉన్నారు. ఈ ప్రదర్శనశాలకు ‘ఇస్రో’ 65 రకాల ‘స్పేస్‌ క్రాఫ్ట్‌’ (రాకెట్‌, శాటిలైట్‌) నమూనాలను సిద్ధం చేసి ఇచ్చింది. జీఎస్‌ఎల్వీ మార్క్‌-।।।, జీఎస్‌ఎల్వీ మార్క్‌-।।, పీఎస్‌ఎల్వీ, చంద్రయాన్‌-। వంటి అనేక నమూనాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. 1975లో ప్రయోగించిన ‘ఆర్యభట్ట’ ఉపగ్రహం, అంతరిక్షం నుంచి భూగోళంపై ఉన్న అనేక విషయాలను వీక్షించి మన కళ్లముందు ఆవిష్కరించే శాటిలైట్‌-।, ఇన్‌శాట్‌, యాపిల్‌, రోహిణి ఆర్‌ఎస్‌-।, జీశాట్‌, కల్పనా చావ్లా స్మారకార్థం 2003లో తయారైన కల్పన-। (మెట్‌శాట్‌) ఇలా ఒక్కటేంటి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేందానికి (ఐఎస్‌ఎస్‌) సంబంధించిన నమూనాలు ఆకట్టుకుంటున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.