
తాజా వార్తలు
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పంజాబీ రచయిత్రి అమృత ప్రీతమ్ శతజయంతిని పురస్కరించుకొని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించి ఆమెకు ఘన నివాళులర్పించింది. ఆమె ఆత్మకథ ‘కాలా గులాబ్’ని మరిపించేలా గూగుల్ డూడుల్ని తీర్చిదిద్దింది. కాలా గులాబ్తో ఆమె జీవితంలోని పలు చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. వీటి స్ఫూర్తితో మహిళలు తమ సమస్యలపై గళం వినిపించడం ప్రారంభించారు. ముఖ్యంగా ప్రేమ, వివాహానికి సంబంధించి మహిళలు నిర్భయంగా మాట్లాడడానికి ప్రీతమ్ జీవిత చరిత్ర ఎంతో స్ఫూర్తినిచ్చిందని సాహితీకారులు చెబుతుంటారు.
బ్రిటిష్ ఇండియా పంజాబ్లోని గుజ్రాన్వాలా ప్రాంతంలో ప్రీతమ్ జన్మించారు. ప్రస్తుతం ఇది పాకిస్థాన్లో ఉంది. సాహిత్య అకాడమీ అవార్డు(1956) అందుకున్న తొలి మహిళగా ప్రీతమ్ ఖ్యాతినార్జించారు. అలాగే జ్ఞానపీఠ్ అవార్డు(1981), పద్మ విభూషణ్(2004) కూడా ఆమెను వరించాయి. ఆమె రచించిన ప్రముఖ నవల ‘పింజర్’ను బాలివుడ్లో చిత్రంగా తెరకెక్కించారు. దీనికి దేశ సమైక్యతా విభాగంలో ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డు లభించింది. దేశ విభజన నేపథ్యంలో వచ్చిన నవలగా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 100కు పైగా పుస్తకాలను ఆమె రచించారు. ఇటు భారత్తో పాటు అటు పాకిస్థాన్లోనూ ప్రీతమ్ రచనలకు అభిమానులున్నారు. 1986లో ప్రీతమ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అక్టోబరు 31, 2005లో అనారోగ్యంతో ప్రీతమ్ తుదిశ్వాస విడిచారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
